shanmuganathan
-
Varatha Shanmuganathan: వరతమ్మా నీకు వందనాలమ్మా!
‘ఈ వయసులో చదువు ఏమిటి!’ అనుకునేవాళ్లు ఒక్కసారి వరత షణ్ముగనాథన్ గురించి చదివితే– ‘అవును. నాకు కూడా చదువుకోవాలని ఉంది’ అని బలంగా అనుకుంటారు. చదువుకు ఉన్న బలం అదే! కెనడాలోని ‘యార్క్ యూనివర్శిటీ’ నుంచి 87 సంవత్సరాల వయసులో మాస్టర్స్ డిగ్రీ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది వరత షణ్ముగనాథన్. విద్యారంగంలో ఆమె స్ఫూర్తిదాయకమైన కృషిని గుర్తించి గౌరవించింది ఆంటేరియో లెజిస్లేచర్ అసెంబ్లీ. షణ్ముగనాథన్ హాలులోకి అడుగు పెడుతున్న సమయంలో సభ్యులు లేని నిల్చొని జయజయధ్వానాలు చేశారు. ‘ఈ తరానికి ఎన్నో రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే మహిళ’ అంటూ షణ్ముగనాథన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు అసెంబ్లీ సభ్యులు. షణ్ముగనాథన్ కెనడాకు వెళ్లిన సమయంలో సీనియర్స్‌కు ‘యార్క్ యూనివర్శిటీ’లో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుసుకొని ఎంతో సంతోషించింది. అలా మాస్టర్స్ ప్రోగ్రాంలో భాగం అయింది. కూతురు ఎంతోప్రో త్సాహకంగా నిలిచింది. ‘యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్’లో డిగ్రీ చేసిన షణ్ముగనాథన్ ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫస్ట్ మాస్టర్స్ డిగ్రీ చేసేనాటికి ఆమె వయసు యాభై సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వరత షణ్ముగనాథన్ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చి వైరల్‌గా మారింది. షణ్ముగనాథన్‌ను ప్రశంసిస్తూ అన్ని వయసులవారి నుంచి కామెంట్స్ వచ్చాయి. మచ్చుకు కొన్ని.... ‘కాస్త వయసు పైబడగానే ఈ వయసులో ఏం నేర్చుకుంటాం అనే నిర్లిప్తత చాలామందిలో ఉంటుంది. ఇలాంటి వారిలో మార్పు తీసుకువచ్చే విజయం ఇది’ ‘నేను ఉద్యోగం నుంచి రిటైరయ్యాను. ఏదైనా చేయాలి...అని ఆలోచించేవాడిని. అంతలోనే ఈ వయసులో ఏం చేస్తాములే అని వెనక్కి వెళ్లేవాడిని. వరతమ్మ వీడియో చూసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. ఆమెలాగే నేను కూడా చదువుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాను’ చదువు ఎప్పుడూ మనల్ని చురుగ్గా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి బలహీనం కాకుండా చూస్తుంది. చదువుకు వయసుతో సంబంధం లేదు. -
కరుణ ‘నీడ’ ఇక లేరు.. స్టాలిన్ కన్నీటి పర్యంతం
సాక్షి, చెన్నై: దివంగత డీఎంకే అధినేత కరుణానిధికి 48 ఏళ్లు వెన్నంటే ఉంటూ సేవలు అందించిన షణ్ముగనాథన్(80) అనారోగ్యంతో మంగళవారం చెన్నైలో మృతి చెందారు. ఆయన భౌతికకాయం వద్ద సీఎం ఎంకే స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర ఉద్వేగంతో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. డీఎంకే అధినేత కరుణానిధి బతికున్నంత కాలం ఆయన వెన్నంటే షణ్ముగనాథన్ నడిచారు. ఎక్కడకు వెళ్లినా కరుణకు నీడగా వ్యవహరించే వారు. కరుణానిధి వెనుకే కూర్చుని ఆయన చేసే ప్రసంగాల్లో చిన్న వాఖ్యం కూడా వదలకుండా షార్ట్ హ్యాండ్ రైటింగ్‌తో రాసుకుని, వాటిని నిమిషాల వ్యవధిలో టైప్ చేసి మరీ మీడియాకు అందించేవారు. చదవండి: (లైంగిన దాడికి గురైన బాలికకు శిశువు జననం) కరుణ మరణం తరువాత షణ్ముగనాథన్ వయోభారం, అనారోగ్య సమస్యలతో చెన్నై తేనాంపేటలోని ఇంటికే పరిమితం అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలిసిన వెంటనే సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎండీఎంకే నేత వైగోలు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన పార్థివదేహాన్ని చూసి స్టాలిన్ కన్నీటి పర్యంతం అయ్యారు. దివంగత నేత కరుణానిధి నీడను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. -
'రాసలీలల' గవర్నర్ రాజీనామాకు ముందు..!
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూనే.. పీఏకు ప్రమోషన్ ఇచ్చిన వైనం రాజ్‌భవన్ కేంద్రంగా లైంగిక కార్యకలాపాలు జరిపారన్న ఆరోపణలతో మేఘాలయ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన వీ షణ్ముగనాథన్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షణ్ముగనాథన్పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు రాజ్‌భవన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో.. కేంద్రం ఆదేశాల మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తన పీఏ (పర్సనల్ అసిస్టెంట్)గా ఉన్న ఓ మహిళకు ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో)గా ఆయన ప్రమోషన్ ఇచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళను గవర్నర్ స్వయంగా ఇంటర్వ్యూ చేయడమే కాదు.. నిబంధనలు పక్కకుతోసేసి.. తన రాజీనామాకు ముందే ఈ పదోన్నతి కల్పించారు. ఈ పోస్టు కోసం ఇంటర్వ్యూకు హాజరైన ఇతర అభ్యర్థులు కూడా గవర్నర్ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులు ఇంటర్వ్యూ చేసిన తర్వాత గవర్నర్ తమకు ఫోన్ చేసి.. 'వన్ టు వన్ ఇంటర్వ్యూ' చేశారని పేర్కొన్నారు. 2016 మార్చిలో గవర్నర్‌కు పీఏగా నియమితులైన మహిళనే.. డిసెంబర్ 7న పీఆర్వోగా గవర్నర్ తిరిగి నియమించుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. పీఏగా ఉన్నప్పుడు ఆమెకు రూ. 6500 నుంచి 12,700 వరకు వేతనం ఉండగా, పీఆర్వోగా నియమితులైన తర్వాత నెలకు రూ. 30వేల జీతాన్ని నిర్ణయించారు. 'వన్ టు వన్ ఇంటర్వ్యూ' పేరిట తనతో గవర్నర్ అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళా అభ్యర్థి తనతో చెప్పినట్టు ఈ పోస్టుకు దరఖాస్తు చేసిన మరో మహిళా అభ్యర్థి తెలిపారు. ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకు తనను పిలువలేదని, కానీ ఈ ఇంటర్వ్యూ కోసం ఇద్దరు మహిళా అభ్యర్థులకు గవర్నర్ స్వయంగా ఫోన్ చేశారని ఆమె చెప్పారు. -
రాసలీలల గవర్నర్ రాజీనామా.. ఆమోదం
మేఘాలయ గవర్నర్ వి. షణ్ముఖనాథన్ (67) చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తక్షణం ఆమోదించారు. రాజ్‌భవన్‌ను యంగ్ లేడీస్ క్లబ్‌గా, తన రాసలీలల కేంద్రంగా మార్చారంటూ ఆ కార్యాలయ ఉద్యోగులు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ముఖ్యమంత్రికి లేఖ రాయడం, షణ్ముఖనాథన్ వైఖరిపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. అయితే షణ్ముఖనాథన్ అటు మేఘాలయతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు కూడా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ రెండు రాష్ట్రాలకు కొత్తగా ఇన్చార్జి గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న పి.బి. ఆచార్యను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే అసోం గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్‌ను మేఘాలయకు ఇన్చార్జులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు.