ఫడణ్‌విస్ కు పవార్ స్నేహ హస్తం | Sharad Pawar throws open Wankhede gates for swearing-in | Sakshi
Sakshi News home page

ఫడణ్‌విస్ కు పవార్ స్నేహ హస్తం

Published Wed, Oct 29 2014 6:08 PM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

ఫడణ్‌విస్ కు పవార్ స్నేహ హస్తం

ఫడణ్‌విస్ కు పవార్ స్నేహ హస్తం

ముంబై: మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడణ్‌విస్ కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్నేహ హస్తం అందించారు. ఫడణ్‌విస్ ప్రమాణ స్వీకారోత్సవానికి పూర్తి సహకారం అందించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఐ) అధికారులను పవార్ ఆదేశించారు. అంతేకాదు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న వాంఖేడ్ స్టేడియంను ఉచితంగా ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయించారు. ఎంసీఐకు పవార్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

వాంఖేడ్ మైదానంలో ఈవిధమైన రాజకీయ కార్యక్రమం నిర్వహించనుండడం ఇదే మొదటిసారని ఎంసీఐ సంయుక్త కార్యదర్శి పీవీ శెట్టి తెలిపారు. ఈ నెల 31న జరగనున్న ఫడణ్‌విస్ ప్రమాణస్వీకారోత్సవానికి పూర్తి సహకారం అందించాలని తమ అధ్యక్షుడు పవార్ ఆదేశించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ హాజరుకానున్నారు. దాదాపు 30 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement