అమెరికాలో మేయర్ గా ఎన్నికైన ఓ శునకం | Small Colorado town elects dog as mayor | Sakshi
Sakshi News home page

అమెరికాలో మేయర్ గా ఎన్నికైన ఓ శునకం

Published Tue, Apr 15 2014 9:00 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Small Colorado town elects dog as mayor

వాషింగ్టన్:కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కొలరాడో పట్టణంలోని మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికల్లో ఓ శునకం అత్యధిక మెజారిటీతో గెలిచి రికార్డులకెక్కింది.శునకానికి మేయర్ పీఠం దక్కటమేమిటని ఆశ్యర్యపోకండి. ఇది నిజంగానే నిజం.ఇక్కడ పౌర నాయకుడు లేకపోవడంతో జంతు సంరక్షణ నిధులు సేకరించేందుకు ఈ ఎన్నిక నిర్వహించారు.'టెల్లర్ కౌంటీ రీజినల్ యానిమల్ షెల్టర్' ఈ ఎన్నిక చేపట్టింది. ఆన్ లైన్ లో జరిగే ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు ఒక్కో డాలర్ వస్తుంది.

 

ఈ ఎన్నికల్లో ఏడు శునకాలు, ఓ తోడేలు, ఓ గాడిద,ఓ పిల్లి, ఓ ముళ్లపంది పోటీ పడ్డాయి. అయితే పాకెట్టల్ అనే రెస్యూ విభాగానికి చెందిన ఓ శునకం ఈ పీఠాన్ని చేజిక్కించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement