ఎలిజబెత్ కన్నా సోనియా ధనవంతురాలు | 'Sonia Gandhi richer than Queen Elizabeth' | Sakshi
Sakshi News home page

ఎలిజబెత్ కన్నా సోనియా ధనవంతురాలు

Published Mon, Dec 2 2013 5:29 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ఎలిజబెత్ కన్నా సోనియా ధనవంతురాలు - Sakshi

ఎలిజబెత్ కన్నా సోనియా ధనవంతురాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌ కన్నా ధనవంతురాలని 'హఫింగ్‌టన్‌ పోస్ట్‌' వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక ధనవంతులైన రాజకీయ నేతల జాబితాలో ఆమె 12వ స్థానంలో ఉన్నారు. సోనియా ఆస్తి రెండు బిలియన్‌ డాలర్లని హఫ్‌ పోస్ట్‌ తెలిపింది. భారత కరెన్సీలో సోనియా ఆస్తుల విలువ 12 వేల కోట్ల రూపాయలని పోస్ట్‌ కథనం.

 50 బిలియన్ల ఆస్తితో జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో థాయ్‌లాండ్‌ రాజు భుమిబోల్‌ అదుల్యాదెజ్‌, బ్రూనై సుల్తాన్‌ హసనల్‌ ఉన్నారు. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఆస్తి ఐదొందల మిలియన్‌ డాలర్లు మాత్రమే. 2009లో సోనియా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు 1.38 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఆమెకు సొంత వాహనం కానీ, సొంత ఇల్లు కానీ లేదని వెల్లడించారు. 75 వేల నగదు, బ్యాంక్‌ డిపాజిట్ల రూపంలో 28 లక్షలా 61 వేల రూపాయలున్నాయని ప్రకటించారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement