సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారు: రాహుల్ గాంధీ!
తమ విజయానికి కీలకంగా భావిస్తున్న 'ఆహార భద్రత బిల్లు' పథకాన్ని సామాన్య జనాల దగ్దరికి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఆగస్టులో లోకసభలో ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో ఓటింగ్ లో పాల్గొనలేకపోయిన తన తల్లి సోనియా గాంధీ కన్నీటి పర్యంతమైంది అని రాహుల్ గాంధీ అన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన సోనియా గాంధీ.. 'బిల్లు పాస్ అయ్యేంత వరకు వెళ్లేది లేదు' అని అన్నారని రాహుల్ తెలిపారు.
ఆహార భద్రత బిల్లు కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేశాను. ఓటు బటన్ నొక్కేంత వరకు తాను వెళ్లనని అన్నారు అని రాహుల్ వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా వైద్యానికి వెళ్లకుండా సోనియా పార్లమెంట్ లో ఉండటం ఓ కొడుకుగా తనకు ఆగ్రహం కలిగింది అని అన్నాడు. చివరికి బిల్లుపై చర్చ జరుగుతుండగా రాత్రి 8.15 నిమిషాలకు పార్లమెంట్ ను విడిచి వైద్యం కోసం వెళ్లారని అన్నారు. ఐదు గంటల వైద్య పరీక్షల తర్వాత ఐయిమ్స్ ఆస్పత్రి నుంచి సోనియాను డిశ్చార్జి చేసిన సంగతి తెలిసిందే. ఆహార భద్రత బిల్లు కోసం పోరాటం చేశాను. ఓటింగ్ పాల్గొనకపోవడంతో బాధగా ఉంది అని తర్వాత సోనియా తనతో అన్నారని రాహుల్ చెప్పారు.