స్కూల్‌ ఆవరణలో దారుణ హత్య | Student stabbed to death in school premises in kerala | Sakshi
Sakshi News home page

స్కూల్‌ ఆవరణలో దారుణ హత్య

Published Fri, Jul 14 2017 5:00 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

స్కూల్‌ ఆవరణలో  దారుణ హత్య - Sakshi

స్కూల్‌ ఆవరణలో దారుణ హత్య

కోజికోడ్: పాఠశాల ఆవరణలోనే ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కేరళలోనే మడవూర్ గ్రామ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి శుక్రవారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి స్కూల్ ఆవరణలో ఉన్నాడు. అక్కడికి  హఠాత్తుగా వచ్చిన ఓ వ్యక్తి ఆ పిల్లవాడిని కత్తితో పొడిచాడు. స్థానికులు  కోజికోడ్ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలో ఆ విద్యార్థి కన్నుమూశాడు. దాడి ఘటన చూసిన విద్యార్థులు భయంతో కేకలు వేయటంతో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాసర్‌గోడ్‌కు చెందిన ఆ వ్యక్తి కొద్దిరోజులుగా స్కూల్ పక్కనే ఉంటున్నాడని, అతడికి మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement