బీచ్‌లో కింగ్‌ ఖాన్‌ బర్త్‌డే పార్టీ! | Super star birthday Party AT BEACH | Sakshi
Sakshi News home page

హల్‌చల్‌ చేస్తున్న బీచ్‌లో బర్త్‌డే ఫొటోలు

Published Thu, Nov 3 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

బీచ్‌లో కింగ్‌ ఖాన్‌ బర్త్‌డే పార్టీ!

బీచ్‌లో కింగ్‌ ఖాన్‌ బర్త్‌డే పార్టీ!

కింగ్‌ ఖాన్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ తాజాగా 51వ వసంతంలో అడుగుపెట్టాడు. బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు అందించిన షారుఖ్‌ పుట్టినరోజు గురువారం కావడంతో అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
మరోవైపు తన పుట్టినరోజు వేడుకలను ఒకరోజు ముందే షారుఖ్‌ సినీ ప్రముఖులు, సన్నిహితుల మధ్య  ఆనందంగా జరుపుకొన్నాడు. ముంబైకి కొంత దూరంలో సముద్రతీరంలో ఉన్న అలీబౌగ్‌ నివాసంలో బుధవారం ఈ వేడుకలు జరిగాయి. సముద్ర తీరంలో జరిగిన ఈ బర్త్‌ డే పార్టీలో షారుఖ్‌ కుటుంబసభ్యులు సహా, సినీ ప్రముఖులు కరణ్‌ జోహార్‌, రణ్‌బీర్‌ కపూర్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ బర్త్‌డే పార్టీ ఫొటోలు సోషల్‌ మీడియాలో నెటిజన్లను అలరిస్తున్నాయి. 








Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement