న్యూఢిల్లీ: హత్య, లైంగికదాడుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ 16 ఏళ్లు దాటిన బాలురను పెద్దవారిలాగే భారత శిక్షాస్మృతి ప్రకారం విచారించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. కేబినెట్ ఆమోదంకోసం పంపనున్న ముసాయిదా నోట్‌లో భాగంగా ఈ ప్రతిపాదనను చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారన్నాయి. నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో 16 ఏళ్ల నిందితుడికి స్వల్పశిక్ష పడిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేశారు. దీనికి ఆమోదం లభిస్తే 16-18 ఏళ్ల వయసుండే నిందితులకు జువైనైల్ చట్టం ప్రకారం మినహాయింపులు లభించవు. దీన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వ్యతిరేకించింది.
‘క్రిమినల్ కోర్టుల అధికారాలపై వైఖరి చెప్పండి’
హత్య, లైంగిక దాడులవంటి నేరాల్లో 16-18 ఏళ్ల వయసు నిందితులను విచారించే విషయంలో క్రిమినల్‌కోర్టుల అధికారాలపై నాలుగు వారాల్లో వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది.
‘తీవ్ర నేరాల్లో బాలలను పెద్దవారిలాగే విచారించాలి’
Published Tue, Dec 3 2013 2:26 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement