న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకే.గంగూలీకి వ్యతిరేకంగా బీజేపీ శుక్రవారం పార్లమెంటులో గళమెత్తింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేసి గంగూలీని తొలగింపుపై చర్చ చేపట్టాలని ప్రధాన ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు.
న్యాయ విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్ మానవ హక్కుల సంఘం ఛైర్మన్ అశోక్ గంగూలీ తక్షణం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేశారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని విపక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రస్తావించారు. సుష్మావాదనతో తృణమూల్ కాంగ్రెస్ ఏకీభవించింది. జస్టిస్ గంగూలీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.