టాటా మరో వికెట్ డౌన్ | Tata Global Beverages: Analjit Singh resigns as Independent Director | Sakshi
Sakshi News home page

టాటా మరో వికెట్ డౌన్

Published Tue, Dec 20 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

టాటా మరో వికెట్ డౌన్

టాటా మరో వికెట్ డౌన్

ముంబై:  టాటా గ్రూపు నుంచి సైరస్  మిస్త్రీ  ఉద్వాసన తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  మిస్త్రీ ఉద్వాసన తరువాత ఆయన సన్నిహితులపై టాటా గ్రూపు వేటు వేసింది. దీంతోపాటు మిస్త్రీ అనుయాయులు కొంతమంది  రాజీనామా చేశారు. అయితే తాజాగా  టాటా గ్రూపులోని అతి పెద్ద సంస్థ టాటా గ్లోబల్‌  బెవరేజెస్‌  సంస్థ బోర్డుకు మరో  డైరెక్టర్ గుడ్ బై చెప్పారు.  టాటా బేవరేజెస్ స్వతంత్ర డైరెక్టర్, మ్యాక్స్  హెల్త్ కేర్ అండ్  మ్యాక్స్ బుపా ఇన్సూరెన్స్ కంపెనీ ఛైర్మన్  అనల్జిత్ సింగ్ మంగళవారం  రాజీనామా చేశారు.  నవంబరు 15న జరిగి టాటా గ్లోబల్ బోర్డు సమావేశంలో మిస్త్రీకి ఉద్వాసనకు వ్యతిరేకంగా వాదించిన డైరెక్టర్లలో అనల్జిత్  కూడా  ఒకరు.

నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి అనల్జిత్ సింగ్ రాజీనామా చేశారని  టాటా గ్లోబల్   ప్రకటించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా టాటా గ్రూపు నుంచి ఛైర్మన్‌గా  తొలగించిన  సైరస్‌ మిస్త్రీని టాటా గ్లోబల్ ఇటీవల తొలగించింది.    పలు టాటా కంపెనీల పదవుల నుంచి తొలగింపు  నేపథ్యంలోనే టాటా గ్లోబల్ కూడా  మిస్త్రీని ఛైర్మన్  గా తొలగించిని సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement