ముగిసిన టీడీపీ - బీజేపీ సమన్వయ కమిటీ భేటీ | TDP - BJP coordinate meeting at vijayawada | Sakshi
Sakshi News home page

ముగిసిన టీడీపీ - బీజేపీ సమన్వయ కమిటీ భేటీ

Published Sat, Dec 5 2015 10:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

TDP - BJP coordinate meeting at vijayawada

విజయవాడ : టీడీపీ - బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ముగిసింది. ఇకపై ప్రతి నెల ఈ సమన్వయ కమిటీ సమావేశం కావాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఏపీ సమస్యలపై వారు సుధీర్ఘంగా చర్చించారు. అలాగే పరస్పర విమర్శలు మానుకోవాలని వారు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఏపీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్, నారా లోకేశ్, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణతోపాటు బీజేపీ నేత,ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీలు కంభంపాటి హరిబాబు, గంగారాజు హజరయ్యారు. అయితే ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం హాజరుకాలేదు.

ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బీజేపీపై టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీ నేతలపై బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. దాంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగే అవకాశాలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు శనివారం విజయవాడలోని చంద్రబాబు నివాసంలో సమావేశమై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement