బెజవాడలో ఆలయాల కూల్చివేత, ఉద్రిక్తత | bjp versus tdp leaders in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో ఆలయాల కూల్చివేత, ఉద్రిక్తత

Published Sun, Jul 3 2016 1:49 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బెజవాడలో ఆలయాల కూల్చివేత, ఉద్రిక్తత - Sakshi

బెజవాడలో ఆలయాల కూల్చివేత, ఉద్రిక్తత

విజయవాడ: విజయవాడలో టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. ఆదివారం విజయవాడలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు మీడియా సమావేశాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు. టీడీపీ, బీజేపీ నేతల వాగ్వాదంతో గోశాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. బీజేపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. ఆలయాలను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని సోము వీర్రాజు హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement