'పార్లమెంట్లో పాములోడు'
న్యూఢిల్లీ : చిత్ర విచిత్ర వేషాలతో నిరసన వ్యక్తం చేసే చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాదరెడ్డి మరోసారి వినూత్నంగా తన నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పాములు పట్టేవాడి వేషంతో ఆయన సోమవారం పార్లమంట్ ఆవరణలో తన నిరసన తెలియజేశారు. అంతకు ముందు శివప్రసాద్ యముడుగా, కృష్ణుడు, నారదుడు.... ఇలా రకరకాల వేషధారణలతో పార్లమెంట్లో సమైక్యగళాన్ని వెలుగెత్తిన విషయం తెలిసిందే.
మరోవైపు మతహింస నిరోధక బిల్లును అడ్డుకున్న తరహాలోనే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటామని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు ప్రకటించారు. ఇప్పటికే అన్ని పార్టీలతో చర్చించామని... అందరూ సహకరిస్తారనే నమ్మకం తమకుందని టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి నివాసంలో సమావేశమైన ఎంపీలు ఈ సమైక్య రాష్ట్రం కోసం పోరాడాలని నిర్ణయించారు.