పిల్లలకు ఏదైనా నేర్పించాలంటే.. వారిని మభ్య పెట్టో మాయచేసో లేదా బెదిరించో చేయాల్సిన పని లేదని ఓ టీచర్ నిరూపించారు. కేవలం రెండే రెండు ఆపిల్ పండ్లతో పిల్లలకు మంచి, చెడ్డలపై పిల్లలకు ఆమె అవగాహన కలిగించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జూన్ 22 నుంచి ఇప్పటివరకు ఈ పోస్టును దాదాపు 1.6 లక్షల మంది ఇష్టపడగా, 1.9 లక్షల మంది షేర్ చేశారు.
బ్రిటన్ లోని రిలాక్స్ కిడ్స్ అనే పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించే సంస్థలో కోచ్ రోసీ దుత్తన్ పనిచేస్తున్నారు. రెండు ఆపిల్ పండ్లను తీసుకున్న రోసీ వాటిలో ఒక దానిని మామూలుగా ఉంచి మరో దానిని పిల్లల ముందు పలుమార్లు కింద పడేశారు. ఆ తర్వాత రెండు పండ్లను పిల్లలకు చూపిస్తూ రెండింటి మధ్య భేదం ఏంటని? అడిగారు. పిల్లల దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో.. తానే వివరించడం మొదలుపట్టారు. ఒక ఆపిల్ ను కింద పడేసి నలిగిపోయేలా చేశామని ఆవిడ చెప్పగానే పిల్లలందరూ కలిసి నలిగిపోని ఆపిల్ ను పొగడటం మొదలుపెట్టారు. దీంతో ఓ కత్తితో ఆ రెండింటిని కట్ చేసి పిల్లలకు చూపించడంతో వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అలా ఆపిల్ ను చూపుతూ మనం చేసే ప్రతి పని ఎదుటివారి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని వారికి వివరించారు.
ఆపిల్ ముక్కలు చూపించి..!
Published Fri, Jun 24 2016 7:56 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
Advertisement