bully
-
మహిళపై అసభ్యకర పోస్టులు.. అమ్మకానికి పెడుతున్నట్లు..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): తమపై బుల్లి బాయ్స్ పేరుతో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా, అమ్మకానికి పెడుతున్నట్లు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టోలిచౌకికు చెందిన ఓ మహిళ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గిట్‌హాబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సులీ డీల్స్ పేరుతో ఖాతా తెరిచి ఆ తరువాత దానిని బుల్లీ బాయ్స్‌గా పేరు మార్చారు. ఇందులో ముస్లిం మహిళలను విక్రయిస్తున్నట్లు పోస్టులు పెట్టారు. దీనిపై ట్విట్టర్లో దుమారం రేగడంతో ఢిల్లీ, ముంబాయి సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న బాధితురాలి ఫోటోను కూడా అలాగే ఆ పోస్టులో పెట్టడంతో బాధితురాలు తాజాగా సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై 509, 354డీ, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా మరో మహిళ సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. -
ఆపిల్ ముక్కలు చూపించి..!
పిల్లలకు ఏదైనా నేర్పించాలంటే.. వారిని మభ్య పెట్టో మాయచేసో లేదా బెదిరించో చేయాల్సిన పని లేదని ఓ టీచర్ నిరూపించారు. కేవలం రెండే రెండు ఆపిల్ పండ్లతో పిల్లలకు మంచి, చెడ్డలపై పిల్లలకు ఆమె అవగాహన కలిగించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జూన్ 22 నుంచి ఇప్పటివరకు ఈ పోస్టును దాదాపు 1.6 లక్షల మంది ఇష్టపడగా, 1.9 లక్షల మంది షేర్ చేశారు. బ్రిటన్ లోని రిలాక్స్ కిడ్స్ అనే పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించే సంస్థలో కోచ్ రోసీ దుత్తన్ పనిచేస్తున్నారు. రెండు ఆపిల్ పండ్లను తీసుకున్న రోసీ వాటిలో ఒక దానిని మామూలుగా ఉంచి మరో దానిని పిల్లల ముందు పలుమార్లు కింద పడేశారు. ఆ తర్వాత రెండు పండ్లను పిల్లలకు చూపిస్తూ రెండింటి మధ్య భేదం ఏంటని? అడిగారు. పిల్లల దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో.. తానే వివరించడం మొదలుపట్టారు. ఒక ఆపిల్ ను కింద పడేసి నలిగిపోయేలా చేశామని ఆవిడ చెప్పగానే పిల్లలందరూ కలిసి నలిగిపోని ఆపిల్ ను పొగడటం మొదలుపెట్టారు. దీంతో ఓ కత్తితో ఆ రెండింటిని కట్ చేసి పిల్లలకు చూపించడంతో వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అలా ఆపిల్ ను చూపుతూ మనం చేసే ప్రతి పని ఎదుటివారి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని వారికి వివరించారు. -
ప్రయర్ ఓ రౌడీ
లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన ఆత్మకథతో మరోసారి వార్తల్లో నిలిచాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు కోచ్ ఆండీ ఫ్లవర్‌పై ‘కేపీ: ది ఆటోబయోగ్ర ఫీ’ పుస్తకంలో విరుచుకుపడ్డాడు. సోమవారం ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. వికెట్ కీపర్ మాట్ ప్రయర్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని చెడగొట్టడంలో ముందుండేవాడని, అతడో రౌడీ అని ఆరోపించాడు. కోచ్ ఫ్లవర్ ఓ నియంతలా వ్యవహరించారని తెలిపాడు. గతేడాది యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-5తో ఓడిన అనంతరం పీటర్సన్‌ను జట్టు నుంచి తప్పించారు. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా సూటిగా స్పందించిన దాఖలాలు లేవు. దక్షిణాఫ్రికాలో జన్మించిన కేపీ ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటికీ తనను జట్టులోంచి ఎందుకు తొలగించారనేది అర్థం కావడం లేదని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ‘ఫీల్డర్లు క్యాచ్‌లు మిస్ చేస్తే సీనియర్ బౌలర్లు స్వాన్, అండర్సన్, బ్రాడ్, కీపర్ ప్రయర్ వారిని తిట్టే విధానం చూసి షాక్ తినేవాణ్ణి. మ్యాచ్ ముగిశాక వారిని క్షమాపణ చెప్పాలని బలవంతం చేసేవారు. ఈ బౌలర్లు ఎప్పుడూ వైడ్ బంతులు వేయలేదా.. ప్రయర్ క్యాచ్‌లు వదిలేయలేదా? అటు ఫ్లవర్ కూడా ఆటగాళ్లను భయంలో ఉంచేవారు. ఈ విషయంపై నేనతన్ని సూటిగానే ప్రశ్నించి నీకు భయపడను అని చెప్పాను’ అని 34 ఏళ్ల పీటర్సన్ వివరించాడు.