
తొలి ముద్ర తెలంగాణదే
న్యూఢిల్లీ : జీఎస్టీ బిల్లుకు ఇంకా ఏడు రాష్ట్రాలు ఆమోదముద్ర వేయాల్సి ఉందని కేంద్రం ప్రకటించింది. సోమవారం నాటికి జీఎస్టీకి 24 రాష్ట్రాలు ఆమోదముద్ర వేశాయి. బీజేపీ యేతర పాలిత కేరళ, కర్నాటక, తమిళనాడు, జమ్ము-కశ్మీర్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మేఘాలయ రాష్ట్రాలు జీఎస్టీకి ఇంకా ఆమోదం తెలపలేదు.
ఇప్పటివరకు 24 రాష్ట్రాలు ఆమోదముద్ర వేయగా, అందులో తెలంగాణ అన్ని రాష్ట్రాలకన్నా మొదటగా ఆమోదం తెలిపింది. తెలంగాణ (9 ఏప్రిల్, 2017), బీహార్ (24 ఏప్రిల్), రాజస్థాన్ (26 ఏప్రిల్), జార్ఘండ్ (27 ఏప్రిల్), చత్తీస్ గఢ్ (28 ఏప్రిల్), ఉత్తరాఖంఢ్ (మే 2), మధ్యప్రదేశ్ (మే 3), హర్యానా (మే 4), గోవా, గుజరాత్ (మే 9), అస్సోం (మే 11), అరుణాచల్ ప్రదేశ్ (మే 12), ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ (మే 16), పాండిచ్చేరి (మే 17), ఒడిసా (మే 19), మహారాష్ట్ర (మే 22), త్రిపుర, సిక్కిం, మిజోరం (మే 25), నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్ (మే 27), ఢిల్లీ (మే 31), మణిపూర్ (జూన్ 5) జీఎస్టీకి ఆమోదముద్ర వేశాయి.