కాలిఫోర్నియాలో కృష్ణాజిల్లా విద్యార్థి గల్లంతు | Telugu student putta naresh goes missing In California Livermore | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో కృష్ణాజిల్లా విద్యార్థి గల్లంతు

Published Mon, Jun 20 2016 6:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

కాలిఫోర్నియాలో కృష్ణాజిల్లా విద్యార్థి గల్లంతు

కాలిఫోర్నియాలో కృష్ణాజిల్లా విద్యార్థి గల్లంతు

విజయవాడ: అమెరికా కాలిఫోర్నియాలోని లివర్‌మోర్‌ నదిలో ఓ తెలుగు విద్యార్థి గల్లంతయ్యాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేష్‌ కాలిఫోర్నియా యూనివర్సిటిలో ఎమ్మెస్సీ సెకండియర్‌ చదువుతున్నాడు. పరీక్షలు పూర్తవడంతో స్నేహితులతో కలిసి అతడు విహార యాత్రకు వెళ్లాడు.

ఈ సందర్భంగా పడవలో షికారుకు వెళ్లిన నరేష్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. నరేష్ కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. కుమారుడు గల్లంతు అయిన వార్త తెలుసుకున్న నరేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అతడి తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement