భూపాల్ సంచలన నిర్ణయం | Telugu writer M. Bhoopal Reddy returned his Sahitya Akademi award | Sakshi
Sakshi News home page

భూపాల్ సంచలన నిర్ణయం

Published Fri, Oct 16 2015 6:51 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

భూపాల్ సంచలన నిర్ణయం

భూపాల్ సంచలన నిర్ణయం

హైదరాబాద్: ప్రముఖ రచయిత, కళాకారుడు ఎం. భూపాల్ రెడ్డి (భూపాల్) సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. పలు విషయాల్లో ప్రస్తుత కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆయనకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరగి ఇచ్చేస్తున్నట్లు గురువారం రాత్రి ప్రకటించారు. పిల్లలకు సంబంధించిన కథాంశంతో 'ఉగ్గుపాలు' అనే పేరుతో  ఆయన రాసిన పుస్తకానికిగానూ 2010లో భూపాల్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.

రచయితగానే కాక సినీనటుడుగానూ ఆయన ప్రసిద్ధి. తెలంగాణ జీవన వైచిత్రి,  పోరాట యోధుల జీవితాలు కథాంశాలుగా వచ్చిన అనేక సినిమాల్లో ఆయన నటించారు. మా భూమి, కొమరం భీం సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, మోదీ సర్కార్ విధానాలను నిరసిస్తూ పలువురు రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగిచ్చేస్తున్న సందర్భంలో ఆ నిర్ణయాన్ని ప్రకటించిన మొదటి తెలుగు రచయిత భూపాలే కావడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement