కష్టాల కడలిలో కంపెనీలు..!
ప్రస్తుతం యూరోపియన్ కంపెనీలన్నీ కష్టాల కడలిలో ఉన్నాయని బిజినెస్ లీడర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇస్లామిక్ దేశాల్లో నెలకొంటున్న మాదిరిగా యూరోపియన్ దేశాల్లో ప్రాంతీయ రాజకీయ ప్రమాదాలు, యూరోపియన్ శరణార్థ సంక్షోభం, వ్యాపారాల విజయానికి పెద్ద ప్రమాదాలుగా మారుతున్నాయని బిజినెస్ లీడర్లు భయాందోళనకు గురవుతున్నారు. బ్రిటన్ లో బ్రెగ్జిటే అత్యంత ప్రమాదకరంగా మారిందని డెలాయిట్ నిర్వహించిన తాజా యూరోపియన్ సీఎఫ్ఓ సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో 17 యూరోపియన్ దేశాల్లో 1,500 సీఎఫ్ఓలపై డెలాయిట్ ఈ సర్వేను చేపట్టింది. క్యాపిటల్ మార్కెట్, ఫండింగ్, బిజినెస్ రిస్క్, మొత్తంగా మార్కెట్ సెంటిమెంట్ వంటి అంశాలపై విశ్లేషణ చేపట్టింది.
2016లో యూరప్ లో అతిపెద్ద కంపెనీలు సాధించే ఫైనాన్సియల్ విజయాలకు ఎదురవుతున్న సవాలపై ప్రధానంగా దృష్టిసారించి డెలాయిట్ ఈ రిపోర్టును రూపొందించింది. ప్రాంతీయ రాజకీయాల ఆధిపత్యం, జనాభా పెరుగుదల, కరెన్సీ విలువలు పడిపోవడం, ఆర్థిక విధానంలో భయాందోళనలు, డీప్లేషన్, వంటివి దేశాల్లో ఉన్న ప్రధాన అవరోధాలుగా సర్వే పేర్కొంది. ప్రాంతీయ రాజకీయాల సంక్షోభం అత్యధిక యూరప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ల మదిలో కొనసాగుతున్న అతిపెద్ద సమస్యగా సర్వే గుర్తించింది.
దురదృష్టవశాత్తు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ ప్రజాభిప్రాయం రావడం ప్రస్తుతం బిజినెస్ లకు అతిపెద్ద నష్టంగా సీఎఫ్ఓలు పరిగణించారని సర్వేలో వెల్లడైంది. ఈ ఫలితాలు యూకే సీఎఫ్ఓల్లో సెంటిమెంట్ ను బలహీనపరస్తోందని రిపోర్టు నివేదించింది. యూకే ఎజెండాను బ్రెగ్జిట్ రెఫరెండం డామినేట్ చేస్తుందని పేర్కొంది. యూకేలోని చాలా అతిపెద్ద కంపెనీలు ఊహించని విధంగా రెఫరెండం వచ్చిందని, బ్రెగ్జిట్ కు ఇంకా కంపెనీలు ప్రిపేర్ కాన్నట్టు డెలాయిట్ రిపోర్టు తెలిపింది.