బిహార్ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో విభిన్నమైన స్పందన కనిపించింది. కొందరు దీనిని ప్రజాస్వామ్య విజయంగా
జంగల్ రాజ్
సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు
బిహార్ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో విభిన్నమైన స్పందన కనిపించింది. కొందరు దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించగా... మరికొందరు బిహార్ తిరిగి ‘జంగల్‌రాజ్’ పాలనలోకి వెళ్లిపోతుందేమోనన్న సందేహం వ్యక్తం చేశారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ భారీ విజయంపై కామెంట్లతో ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ వెబ్‌సైట్లు నిండిపోయాయి. బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల్లోని భారతీయుల నుంచి కూడా స్పందన వ్యక్తమైంది. బిహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్‌లో బాణసంచా కాలుస్తారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ.. ‘పాకిస్తాన్ గురించి మాకు తెలియదుగానీ.. ఇప్పుడు భారత్‌లో మాత్రం బాగా బాణసంచా పేలుస్తారు..’ అని ఓ నెటిజన్ విర్శించారు.