అమెరికాకు అతిపెద్ద వాణిజ్య దేశాలివే!
వాణిజ్య సంబంధాల కోసం ఒకదేశం మరొక దేశంతో జతకట్టక తప్పదు. అది అగ్రరాజ్యమైనా, చిన్న చితక ప్రాంతమైనా. అమెరికా అయితే తన వాణిజ్య ఒప్పందాల విస్తరణకు మొదటి నుంచి ఎక్కువగా పాకులాడుతూ ఉంటోంది. ఏడాదికి అమెరికా ఇతర దేశాలతో దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల(రూ.3,39,22,475 కోట్ల) వాణిజ్యం చేస్తుందట. అమెరికాకు అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్లుగా చైనా, కెనడా, మెక్సికోలు దేశాలున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ దేశాలే దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతి, దిగుమతులు నిర్వహిస్తున్నాయట.
కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో అప్పటి నుంచి అమెరికా వాణిజ్య సంబంధ రూపురేఖలన్నీ మారేలా కనిపిస్తున్నాయని వెల్లడవుతోంది. చైనాపై ముందునుంచి ఆయన చూపిస్తున్న వ్యతిరేకత, వీసా నిబంధనల కఠినతరం వంటివి డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరుగబోయే ముఖ్యమైన మార్పులు. ట్రంప్ వైట్హోస్లోకి అడుగుపెట్టగానే ఉచిత వాణిజ్య ఒప్పందాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. టారిఫ్లను అమలుచేస్తానని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా అమెరికాకు టాప్ టెన్ ట్రేడింగ్ పార్టనర్స్ ఏ దేశాలు ఉన్నాయో ఓసారి చూద్దాం...
అమెరికా ఎగుమతులు....
-
కెనడా............15 శాతం
-
మెక్సికో.........11.9 శాతం
-
చైనా..............7.3 శాతం
-
యూకే............5.5 శాతం
-
జపాన్............4.7 శాతం
-
జర్మనీ.............3.5 శాతం
-
దక్షిణకొరియా......2.8 శాతం
-
బ్రెజిల్................2.7 శాతం
-
నెదర్లాండ్స్.........2.5 శాతం
-
స్విట్జర్లాండ్.........2.4 శాతం
అమెరికా దిగుమతులు.....
-
చైనా..............18.2 శాతం
-
కెనడా.............11.9 శాతం
-
మెక్సికో..........11.6 శాతం
-
జపాన్............5.9 శాతం
-
జర్మనీ............5.7 శాతం
-
యూకే............4.1 శాతం
-
దక్షిణకొరియా.....3 శాతం
-
ఇండియా........ 2.5 శాతం
-
ఫ్రాన్స్..............2.3 శాతం
-
ఐర్లాండ్.............2 శాతం