పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కళంకం: కమల్నాథ్ | Today is Black Day of Indian Democracy, says kamal nath | Sakshi
Sakshi News home page

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కళంకం: కమల్నాథ్

Published Thu, Feb 13 2014 1:13 PM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కళంకం: కమల్నాథ్

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కళంకం: కమల్నాథ్

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరు పట్ల కేంద్ర మంత్రి కమల్నాథ్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్ వెలుపల కమల్నాథ్ విలేకర్లతో మాట్లాడుతూ... పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టామని చెప్పారు. అనంతరం సభ్యులు వ్యవహరించిన తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కళంకమని ఆయన అభివర్ణించారు. సభలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని పార్టీల నేతలు తమను కోరారని ఆయన చెప్పారు.

 

సభలో జరిగిన పరిణామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బిల్లుకు అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ సభలోని సభ్యులు తమ అభిప్రాయాలు తెలపవచ్చని కమల్ నాథ్ తెలిపారు. సభలో ప్రతి ఒక్క సభ్యుడు తమ మనోభావాలను వ్యక్తీకరించే అవకాశం ఉంటుందన్నారు. సభ్యులు ఈ విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామంలో అత్యంత హేయమైన చర్యగా కమల్నాథ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement