సౌదీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వేతనం 50 వేలు! | tomcom offers saudi arabia jobs | Sakshi
Sakshi News home page

సౌదీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వేతనం 50 వేలు!

Published Sun, Oct 16 2016 8:15 PM | Last Updated on Mon, Aug 20 2018 7:33 PM

సౌదీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వేతనం 50 వేలు! - Sakshi

సౌదీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వేతనం 50 వేలు!

రంగారెడ్డి జిల్లా: సౌదీ అరేబియాలోని ప్రఖ్యాత ఆస్పత్రుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి సోమ, మంగళవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థ టామ్‌కమ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ) ఆధ్వర్యంలో  ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని సంస్థ ఎండీ కేవై నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అనస్తీషియా టెక్నీషియన్, నర్సు, అసిస్టెంట్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్‌ టెక్నీషియన్, మెడికల్ కోడర్, ఎక్స్‌రే టెక్నీషియన్, ఫిజియోథెరపీ టెక్నీషియన్ తదితర కొలువుల్లో 156 ఖాళీలున్నాయన్నారు.

ఈ ఉద్యోగాలకు సగటున రూ.50 వేల వేతనంతోపాటు నివాసం, భోజనం, రవాణా వసతి సౌకర్యాలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసుకున్న కంపెనీ భరిస్తుందన్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు పాస్‌పోర్టు లేనప్పటికీ.. సదరు కంపెనీ ఈ సౌకర్యాన్ని సమకూరుస్తుందని, అర్హతలున్న అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో మెహిదీపట్నంలోని జీ పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement