లండన్: మీ శరీరంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని అధిక బరువు పెరుగుతున్నారా? అయితే ఒకసారి నిద్రించే సమయంలో గదిలోని పరిస్థితులపై దృష్టి పెట్టండి. ఎందుకంటే మీకు తెలియకుండానే బరువు పెరిగితే.. అందుకు మనం పడుకునే గదిలో అధిక కాంతి ఉండటమేనట. బ్రిటన్ కు చెందిన కేన్సర్ రీసెర్చ్ సెంటర్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకు గాను 1,13,000 మంది 40 ఏళ్ల దాటిన మహిళలను పరిశోధించారు.
వీరిలో కొంతమంది అధిక కాంతిలో నిద్రించే కారణంగా జీవక్రియలో పలు మార్పులు చోటు చేసుకుని స్థూలకాయం రావడానికి దోహదం చేసిందని ప్రొఫెసర్ ఆంటోని స్వెర్ డ్లో పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు రాత్రి పడుకునే ముందు కాంతితో కూడిన లైట్లను వినియోగిస్తే ఈ తరహా రోగాల బారిన పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు.