
టీఆర్‌ఎస్ ఎంపీల అసమర్థత వల్లే: పొన్నం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీల చేతకానితనంతోనే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైల్వేల అవసరాలను కేంద్రప్రభుత్వానికి చెప్పడంలో వారు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
రైల్వే ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఎంపీలతో కనీసం ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు.