న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజ్యాంగపరమైన ఆటంకాలను అధిగమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని టీఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, జేఏసీ చైర్మన్ కోదండరాం సహా 40 మంది నేతలు గురువారం రాష్ట్రపతిభవన్‌లో ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యూరు. తెలంగాణ బిల్లును శాసనసభ అభిప్రాయం కోసం పంపించినందుకు కృతజ్ఞతలను తెలిపారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను కేసీఆర్ రాష్ట్రపతికి వివరించారు. కనీసం చర్చ జరగకుండానే రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు తిరస్కరణ తీర్మానాన్ని ఆమోదించినట్టుగా స్పీకర్ ప్రకటించారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ఒప్పందాల ఉల్లంఘనలు, 60 ఏళ్లుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీ, తెలంగాణ విద్యార్థుల బలిదానాలు వివరించారు. కాగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు భేటీ అనంతరం కేసీఆర్ విలేకరులకు వివరించారు.
రాష్ట్రపతితో, అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమైన తర్వాత తెలంగాణ ఏర్పాటు విషయంలో ఉన్న మబ్బులు వీడిపోయూయని వ్యాఖ్యానించారు. ఎంపీలు జి.వివేక్, మందా జగన్నాథం, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, పి.సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, జి.వినోద్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు జి.జగదీశ్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జేఏసీ నేతలు దేవీప్రసాద్, సి.విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, మాదు సత్యం, మణిపాల్‌రెడ్డి, విద్యార్థి నేత గ్యాదరి కిశోర్‌కుమార్ తదితరులు రాష్ట్రపతిని కలిశారు. కేసీఆర్‌తో రాష్ట్రపతి ప్రత్యేకంగా 15 నిమిషాల పాటు భేటీ అయ్యూరు. ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది తెలియరాలేదు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన నేతల లిస్టులో టీ జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య పేరును కేసీఆర్ చివర్లో తొలగింపజేసినట్లు సమాచారం.
తెలంగాణ ‘ప్రక్రియ’ పూర్తిచేయండి: టీఆర్‌ఎస్
Published Fri, Feb 7 2014 2:33 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement