ఇద్దరు భారతీయులకు గ్రామీ అవార్డులు | Two Indians win honours at Grammy Awards | Sakshi
Sakshi News home page

ఇద్దరు భారతీయులకు గ్రామీ అవార్డులు

Published Tue, Feb 10 2015 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

ఇద్దరు భారతీయులకు గ్రామీ అవార్డులు

ఇద్దరు భారతీయులకు గ్రామీ అవార్డులు

లాస్‌ఏంజిల్స్: సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’ అవార్డులను ఇద్దరు భారతీయులు సొంతం చేసుకున్నారు. 57వ ‘గ్రామీ’ అవార్డుల ప్రధానోత్సవం సోమవారమిక్కడ అట్టహాసంగా జరిగింది. బెంగళూరుకు చెందిన సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ తన ‘విండ్స్ ఆఫ్ సంసారా’ ఆల్బమ్‌కు ఈ అవార్డు గెలుచుకున్నాడు.

అదే విధంగా నీలా వాస్వాని.. మలాలా యూసఫ్ జాయ్‌పై తీసిన డాక్యుమెంటరీ‘ఐ యామ్ మలాలా: హౌ వన్ గర్ల్ స్టూడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ చెంజ్‌డ్ ద వరల్డ్’కి ‘గ్రామీ’ అవార్డు గెలుచుకున్నారు. రిక్కీ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరిలో అవార్డుకు ఎంపికవగా, నీలా బెస్ట్ చిల్డ్రన్స్ ఆల్బమ్ కేటగిరిలో ఈ అవార్డు గెలుచుకున్నారు. రిక్కీ ఇంతకముందు కన్నడ చిత్రాలకు స్వరాలు అందించారు.

ఇది రిక్కీ 14వ ఆల్బమ్. నీలా వాస్వాని రచయిత్రి. ఆమె ‘వేర్ ద లాంగ్ గ్రాస్ బెండ్స్’ అనే చిట్టి కథల సంకలనాన్ని, ‘యూహవ్ గివెన్ మీ ఏ కంట్రీ’ అనే స్వానుభవ చరిత్రను రచించారు. సితార విద్వాంసుడు దివంగత రవిశంకర్ ప్రసాద్ కుమార్తె అనౌష్క శంకర్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో పోటీపడినప్పటికీ, అవార్డు గెలుచుకోలేకపోయారు. బ్రిటిష్ సింగర్ సామ్‌స్మిత్ పలు విభాగాల్లో 4 ‘గ్రామీ’ అవార్డులు అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement