'వాహ్ మోదీ!'
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. నల్లధనం వెలికితీయడానికి బదులుగా గోమాంసం ఎక్కడుందో వెతకడానికే పోలీసులను కేంద్రం ఉపయోగిస్తోందని ఆక్షేపించారు. 'బ్లాక్ మనీ ఎక్కడుందో కనిపెట్టేందుకు పోలీసులు దాడులు చేయడం లేదు. గోమాంసం కోసం పోలీసులు సోదాలు చేస్తున్నారు. వాహ్ మోదీ!' అంటూ బృందా కారత్ ట్వీట్ చేశారు.
గోమాంసం వడ్డిస్తున్నారనే ఫిర్యాదుతో ఢిల్లీలోని కేరళ హౌస్ లో సోమవారం పోలీసులు సోదాలు చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వండుకోవడానికి పప్పులు ఇవ్వలేని మోదీ సర్కారు ఆవు మాంసం కోసం పోలీసులతో వెతికిస్తోందని ధ్వజమెత్తారు.
Brinda Karat: Police raids not to unearth black money but to unearth imaginary cow meat, vah Modi! #KeralaHouse
— CPI (M) (@cpimspeak) October 28, 2015