న్యూఢిల్లీ: తమ ఫీజుల విధానాన్ని, గత ఐదేళ్లలో పెంచిన ఫీజుల వివరాలను అందజేయాలని ప్రైవేట్ స్కూళ్లను సీబీఎస్‌ఈ ఆదేశించింది. పాఠశాల పరిసరాల్లో పుస్తకాలు, యూనిఫాంలను అమ్ముతూ ప్రైవేట్ స్కూళ్లు ‘దుకాణాలు’గా మారిపోయాయంటూ సీబీఎస్‌ఈ ఇటీవల విమర్శించడం తెలిసిందే.
‘అసంబద్ధంగా ఫీజులు వసూలు చేయొద్దని అన్ని స్కూళ్లను ఆదేశించాం. స్పందించకుంటే తగిన చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
ఫీజుల వివరాలివ్వండి: సీబీఎస్‌ఈ
Published Sat, Jun 3 2017 8:25 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM
Advertisement