private schools fee
-
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం కీలక సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్న ప్రైవేటు స్కూళ్లకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొన్ని స్కూళ్లు ఏటా ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచుతున్న నేపథ్యంలో దీని నియంత్రణకు 11 మంది మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం... ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసినట్లు తెలిసింది. కొన్ని షరతులకు లోబడి ఏటా 10 శాతం వరకు ఫీజులు పెంచుకొనే అధికారాన్ని ఆయా ప్రైవేటు స్కూళ్లకే ఇవ్వాలని ఇటీవలి సమావేశంలో ఉపసంఘం అభిప్రాయపడ్డట్లు తెలియవచ్చింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ బిల్లు తీసుకొచ్చే వీలుందని సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వ వర్గాలు రూపొందిస్తున్నాయి. ఇటీవలి మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఎజెండాలోని అంశాలు తాజాగా బయటకొచ్చాయి. దీనిప్రకారం ప్రైవేటు స్కూళ్ల జమాఖర్చులనే ఫీజుల పెంపులో కొలమానంగా తీసుకోవాలనే షరతు ప్రభుత్వం విధించనుంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు... – స్కూల్ స్థాయిలో యాజమాన్యం సూచించే వ్యక్తి చైర్మన్‌గా, ప్రిన్సిపల్, టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, ఒక మైనారిటీ, మరో ఇద్దరు ఇతరులతో కమిటీ ఏర్పాటు చేయాలి. – ఫీజు పెంచే సంవత్సరంలోని జమాఖర్చులను ఈ కమిటీలో చర్చించాలి. ముఖ్యంగా ఆడిట్ రిపోర్టును ప్రామాణికంగా తీసుకోవాలి. – జమాఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ కేవలం డిజిటల్ విధానంలోనే జరగాలి. అప్పుడే దాన్ని విశ్వసనీయమైన లెక్కలుగా పరిగణించాలి. – ఈ తరహా లెక్కలు చూపడంలో స్కూల్ కమిటీ విఫలమైతే రాష్ట్ర స్థాయి కమిటీ దీన్ని పరిశీలించి, ఫీజు పెంచాలా? వద్దా? అనేది నిర్ధారిస్తుంది. – రాష్ట్రస్థాయి కమిటీలో ప్రభుత్వం నామినేట్ చేసిన రిటైర్డ్ న్యాయమూర్తి, పాఠశాల విద్య డైరెక్టర్ లేదా కమిషనర్, ప్రభుత్వం సూచించిన విద్యారంగ నిపుణులు ఉంటారు. అంతిమంగా ఈ కమిటీ ఎంత ఫీజు పెంచాలనేది నిర్ణయిస్తుంది. ప్రతిపాదిత చట్టంలోనూ ఇదే నిబంధన! ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనిపై అధ్యయనానికి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని వేసింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మునుపెన్నడూలేనట్లుగా 11 మందిని చేర్చారు. కేబినేట్లో ఉన్న మంత్రుల్లో సగానికిపైగా ఈ కమిటీలో ఉండటం గమనార్హం. షరుతులతో ఫీజుల పెంపునకు ఇంత మంది మంత్రులు ఏకాభిప్రాయం తెలిపిన నేపథ్యంలో ఇదే చట్ట రూపంలో రాబోయే వీలుందని పలువురు భావిస్తున్నారు. -
ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 2021–22 నుంచి 2023–24 బ్లాక్ పీరియడ్‌కు గాను ఫీజుల ప్రతిపాదనలను ఆన్లైన్లో తమకు సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి కోరారు. ఇందుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు కోరుతున్న ఫీజులు, అందుకు సంబంధించిన జమా ఖర్చుల వివరాలు, డాక్యుమెంట్లు, ఇతర సమాచారాన్ని కమిషన్ వెబ్సైట్ (www.apsermc.ap. gov.in)లో పొందుపరచాలని కోరారు. ఇందుకు ఫిబ్రవరి 15 తుది గడువుని పేర్కొన్నారు. ఇంతకుముందు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఫీజులను నిర్ణయించామన్నారు. ఆ ఫీజుల పరిధిలోకి రాని విద్యాసంస్థలు అదనపు ఫీజుల వివరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పామన్నారు. దీన్ని సవాల్ చేస్తూ కొన్ని విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సూచనల మేరకు తిరిగి నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. హైకోర్టు సూచన మేరకు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఫీజులను సవరిస్తుందన్నారు. ఏదైనా విద్యా సంస్థ దరఖాస్తు చేసుకోకపోతే ఫీజులు వసూలు చేసుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. -
ఫీజుకూ ఓ హద్దు.. మీరితే గుర్తింపు రద్దు!
తెలంగాణవ్యాప్తంగా 11వేల ప్రైవేటు స్కూళ్లలో 35 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూళ్లలో ఫీజులు ఇష్టారాజ్యంగా ఉంటున్నాయని, ఎప్పటికప్పుడు భరించలేని విధంగా పెంచుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ఎన్ని జీవోలు తెచ్చినా అవి న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరమే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకూ వార్షిక ఫీజును ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లు ఏటా ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచుతున్నట్టు ప్రభుత్వం దృష్టికొచ్చింది. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఓ కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పేద, మధ్య తరగతి వర్గాలు స్వాగతిస్తున్నాయి. వీలైనంత త్వరగా పటిష్టమైన నియంత్రణాధికారంతో చట్టం తేవాలని మేధావులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. వాస్తవానికి పేదవర్గాలను ఫీజుల పేరుతో పీల్చి పిప్పి చేసే వ్యవస్థలపై 2016లోనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఫీజుల నియంత్రణపై అధ్యయనానికి ఆచార్య తిరుపతిరావు కమిటీని వేసింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు కూడా చేసింది. ఇప్పుడు ఆ సిఫారసులను కూడా పరిగణనలోనికి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. మొత్తం 11 వేల ప్రై వేటు స్కూళ్ళను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చే యోచనలో ఉంది. ఆచార్య తిరుపతిరావు సిఫారసులేంటి? ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల మనోభీష్టాన్ని తెలుసుకుంది. కాగా బడ్జెట్ స్కూళ్ళు (వార్షిక ఫీజు రూ. 20 వేల లోపు ఉండేవి) ఫీజుల నియంత్రణను స్వాగతించాయి. ♦స్కూల్ డెవలప్మెంట్ (అభివృద్ధి) చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి 15 శాతం ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇదే సమస్యగా మారింది. పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపారు. తర్వాత ఫీజులు 25 శాతం పెంచారు. ♦స్కూళ్ళ మూడేళ్ళ ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచు కుని కొన్ని సిఫారసులు తెరమీదకొచ్చాయి. ♦ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులన్నీ బ్యాంకు ద్వారానే చెల్లించాలి. విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానా, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దును కమిటీ సిఫారసు చేసింది. ♦ఈ విధానం అమలుచేస్తే చాలా స్కూళ్ళు 10 శాతానికి లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతిరావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్‌లైన్‌ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం అమల్లోకి రాలేదు. తాజాగా ఈ ప్రతిపాదనలే మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తున్నట్టు సమాచారం. చట్టం అమల్లో చిత్తశుద్ధి అవసరం ఫీజుల నియంత్రణ పేదవాడికి ఊరటనిస్తుంది. దీనికోసం చట్టం తేవడానికే మంత్రివర్గ ఉప సంఘం వేశారంటే స్వాగతించాల్సిందే. అయితే చట్టం తెస్తే సరిపోదు. చట్టం అమలులో చిత్తశుద్ధి అవసరం. అన్ని వర్గాల మనోభావాలకు అనుగుణంగా ఫీజులను నియంత్రించేలా చట్టం ఉండాలి. నియంత్రణలో తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి. – వెంకటసాయినాథ్ కడప, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రై వేటు స్కూళ్ల నిర్వాహకులను చేర్చాలి ప్రభుత్వం నిర్వహించే మోడ ల్, జెడ్పీ స్కూల్స్ మధ్యే నిర్వహ ణ ఖర్చులో తేడా ఉంటుంది. అదే విధంగా ప్రైవేటు బడుల్లోనూ ఆదాయ వ్యయాల్లో తేడా ఉంటుంది.దీన్ని పరిగణనలోనికి తీసుకుని ఫీజులపై నియంత్రణ ఉండాలి. రూ.20 వేల కన్నా తక్కువ ఫీజులున్న స్కూళ్ళను ఈ చట్టం పరిధిలోకి తెస్తే ఉపయోగం ఉండదు. చట్టంలో ప్రై వేటు స్కూళ్ళ యాజమాన్యాల భాగస్వామ్యం ఉండేలా చూడాలి. – యాదగిరి శేఖర్‌రావు, గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్ల (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు చట్టంతోనే ఫీజులకు అదుపు పిల్లల టెన్త్ పూర్తయ్యే సరికి ప్రై వేటు స్కూళ్ళ ఫీజుల కోసం స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. స్కూల్లో కొత్తగా ఏమీ పెట్టకపోయినా ఏటా ఫీజులు పెంచుతున్నారు. అడ్డగోలు ఫీజులపై అధికారులకు చెప్పినా ప్రయోజనం ఉండటం లేదు. చట్టం తీసుకొస్తేనే పేదవాడికి ఉపశమనంగా ఉంటుంది. – వి. సూర్యప్రకాశ్‌రావు, విద్యార్థి తండ్రి, ముత్తారం, ఖమ్మం జిల్లా పటిష్టమైన చట్టం అవసరమే అన్ని వర్గాల అభిప్రాయాల మేరకు ప్రభుత్వానికి అవసరమైన సిఫారసులు చేశాం. వీటిని అమలు చేసే దిశగా.. అవసరమైన చట్టం తేవాలనే దృఢ చిత్తంతో ప్రభుత్వం ముందుకెళ్ళడం హర్షణీయం. ఈ చట్టం ఏ విధమైన సమస్యలకు తావు లేకుండా, ఫీజుల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగానికి ఉపయోగ పడేలా ఉంటుందని ఆశిస్తున్నా. – ఆచార్య తిరుపతిరావు, ప్రభుత్వ కమిటీ చైర్మన్ -
AP: స్కూల్ ఫీజుల చరిత్రలో చారిత్రక ఘట్టం
ఫీజుల విధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం. ఇంతకుముందు కూడా ఫీజులపై పలు విధానాలను గత ప్రభుత్వాలు ప్రకటించాయి. అవేవీ ఆచరణకు నోచుకోలేదు. ఉదాహరణకు ప్రతి విద్యాసంస్థకు ఒక గవర్నింగ్ బాడీ ఉండాలి. ఇందులో యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. ఆ పాఠశాల/కళాశాలకు ఈ కమిటీయే ఫీజులను నిర్ణయించాలి. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అసలు గవర్నింగ్ బాడీ అనేది ఉంటుందని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, డీఈఓ తదితరులతో కూడిన బృందం ఫీజుల నిర్ణయం, వాటి పెంపుదల చేసేలా ఓ విధానం వచ్చింది. అదీ అమలు కాలేదు. దాంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయించుకున్నాయి, పెంచుకున్నాయి. (చదవండి: అట్టడుగు వర్గాలకు అక్షర కాంతులు) ఇప్పుడు హేతుబద్ధంగా ఫీజులు ఖరారు అవుతాయి. అన్ని పాఠశాలలు, కళాశాలలను ఒకటే గాటన కట్టి వేయడం లేదు. నాణ్యమైన విద్య, మంచి వసతులు అందిస్తున్నవీ ఉన్నాయి. వాటికి తప్పకుండా అందుకు సరిపడా ఫీజు నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఫీజులను గట్టిగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో, అంతకు రెట్టింపు తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఈ ఫీజులు అమలు అవుతున్నాయో లేదో ప్రత్యక్షంగా తెలుసుకునేది తల్లిదండ్రులే. గతాన్ని వదిలేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై ఎంతో నిబద్ధత ఉంది. ఈ సందర్భంలో తల్లిదండ్రులు తమ వంతు సహకారాన్ని అందిస్తే విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయవచ్చు. ఐఐటీ, మెడిసిన్ భ్రమల్లో పడిన తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టం ఉన్నా లేకపోయినా, సామర్థ్యం ఉన్నా లేకపోయినా బలవంతంగా కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తున్నారు. మార్కుల పరుగులో అలసిపోయిన పిల్లల కన్నీళ్లను తల్లిదండ్రులు గుర్తించలేక, వారు అఘాయిత్యానికి పాల్పడ్డాక జీవితమంతా కన్నీళ్లను మోస్తున్నారు. (తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!) మీరు గమనించారా? ఐఐటీ, మెడిసిన్ ర్యాంకులన్నీ హైదరాబాద్, విజయవాడ క్యాంపస్‌లలో మాత్రమే వస్తాయి. పిల్లల్లో మెరికల్ని గుర్తించడానికి మాత్రమే జిల్లా కేంద్రాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఐటీ, మెడిసిన్ కోసం 5 నుంచి 10 వేల రూపాయలతో కొనిపించిన ప్రత్యేక మెటీరియల్‌ను చాలా క్యాంపసుల్లో అసలు ఓపెన్ చేయరని మీకు తెలుసా? (ఆంధ్రప్రదేశ్ విద్యావిధానం దేశానికే ఆదర్శం) మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ డబ్బులు వసూలు చేసి, ఒక పూట తిండి లేదా వసతి సరిగ్గా కల్పించకపోతే ఎంత బాధపడతారు? మరి లక్షలాది ఫీజులు కట్టి, ఉండటానికి రూమ్ సరిగా లేదు, తగినన్ని బాత్రూంలు లేవు, బాత్రూం వెళ్లాల్సి వస్తుందని నీళ్లు తాగడం లేదు, సరైన భోజనం పెట్టడం లేదు అని పిల్లలు ఫిర్యాదు చేస్తే మీరు పట్టించుకుంటున్నారా? మీరు చదవడానికి వచ్చారా, తినడానికి వచ్చారా? అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. రెండేళ్ల పాటు ఆ నరకంలో సర్దుకొమ్మని చెబుతున్నారు. అసలు మీ దృష్టికి తీసుకురాలేని ఎన్నో సమస్యల మధ్య పిల్లలు మానసికంగా కుమిలిపోతూ చదువుకుంటున్నారు. ఉదాహరణకు కాలకృత్యాలకు, స్నానానికి ఐదు నిమిషాలు సమయం ఇస్తారు. ఒకవేళ ఆ గడువు దాటితే బాత్రూం డోర్‌కు వేలాడదీసిన బట్టల్ని బయటనుంచి లాగేస్తారు. ఒక కాలేజీ విజిట్‌లో అమ్మాయిలు కన్నీళ్ళతో చేసిన ఫిర్యాదు ఇది. తల్లిదండ్రులను యాజమాన్యాలు హాస్టల్ లోపలికి అడుగు పెట్టనీయడం లేదు. పిల్లల్ని వదిలిన మొదటి రోజు, కోర్సు అయిపోయిన చివరి రోజు మాత్రమే హాస్టల్లోకి అనుమతిస్తున్నారు. ఈ దాపరికం ఎందుకని ఏ రోజైనా ప్రశ్నించారా? అడ్మిషన్ సమయంలో ఫీజు తగ్గిస్తామని చెప్పి టీసీ తీసుకునే సమయంలో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రోజూ మా గ్రీవెన్స్‌కు ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా మోసం చేశారని యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నారా? నిర్ణయించిన ఫీజు కంటే అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రశ్నించండి. ఫీజుకు తగ్గ విద్య, వసతులు కల్పించకపోతే ప్రశ్నించండి. ఓ పది రూపాయల వస్తువులో లోపం కనిపిస్తే దుకాణదారుతో గొడవపడే మనం, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేక పోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తేనే ప్రక్షాళన జరుగుతుంది. నేటి సమస్త మానవాళి అభివృద్ధి పథానికి మూలం సైన్స్. ఆ సైన్స్ అభివృద్ధికి మూలం, ప్రశ్న. తల్లిదండ్రులుగా మీ గళాన్ని విప్పండి. మీకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ మద్దతు ఎప్పటికీ ఉంటుంది. (మా గ్రీవెన్స్ ఫోన్ నంబర్: 9150381111) ఈ చారిత్రక సందర్భంలో మీరు, మేము, మనందరం పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలసికట్టుగా పని చేద్దాం. - సాంబశివారెడ్డి ఆలూరు వ్యాసకర్త సీఈఓ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ -
Private Schools: కాసులిస్తేనే క్లాస్.. లేకుంటే ఆన్లైన్ లింక్‌లు కట్..
కరీంనగర్ పట్టణం బ్యాంక్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని ఓ పేరున్న పాఠశాలలో అతడి కొడుకును 9వ తరగతి చదివిస్తున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు వింటున్నా డు. ఈక్రమంలో అబ్బాయి ఫీజు చెల్లించాలంటూ సదరు వ్యక్తిని పాఠశాల యాజమాన్యం వారం రోజులుగా ఫోన్ చేస్తూ ఒత్తిడి తెస్తోంది. లేకుంటే ఆన్లైన్ కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రూ.15 వేలు చెల్లించగా, అవి పాత బకాయి కింద జమ చేసుకున్నట్లు సదరు పాఠశాల యాజమాన్యం చెప్పిందని ఆ విద్యార్థి తండ్రి ‘సాక్షి’కి తెలిపాడు. వారం రోజుల పాటు ఆన్లైన్ తరగతులు వినేలా లింక్ ఇచ్చారని, ఆ తర్వాత కట్ చేస్తామని చెప్పారని వాపోయాడు. ఫీజు తర్వాత కడుతామని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి తండ్రిని కూడా ఫీజు చెల్లించాల ని వేధిస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇప్పటికే ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున చెల్లించా నని మరో రూ.15 వేలు చెల్లించాలని పాఠశాల నిర్వాహకులు తరచూ ఫోన్ చేయడంతో పిల్లల ఒత్తిడి తట్టుకోలేక అవి కూడా ఇటీవలే చెల్లించానని వాపోయాడు. అయితే మొదట చెల్లించిన రూ.15 వేలు పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద పాఠశాల యాజమాన్యం చూపిస్తోందని, అంతే కాకుండా ఆన్లైన్ తరగతులు వినేందుకు ప్రత్యేకంగా రూ.1,250 చెల్లించాలనే నిబంధన పెట్టినట్లు ఆ విద్యార్థి తండ్రి చెప్పాడు. సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పేరున్న పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నాయి. నగరంలోని మంకమ్మతోట, వావిలాలపల్లి, భగత్‌నగర్, గణేశ్‌నగర్ తదితర కాలనీల్లో ఉన్న కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయి. అయితే సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం ఈ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. “ఫీజు చెల్లిస్తారా.. లేదంటే ఆన్లైన్ తరగతుల లింక్ కట్ చేయమంటారా’.. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నాయి. చెప్పిన చోటే పుస్తకాలు కొనాలి కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తాము చెప్పిన చోటే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. వారికి కమీషన్ ఇచ్చే దుకా ణాల్లో మాత్రమే స్టడీ మెటీరియల్ కొనాలని షరతులు విధించడం లేదంటే పాఠశాలలోనే బిల్లు చెల్లించాలని కరాఖండిగా చెబుతున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం చర్యలు తీ సుకోవడం లేదు. కనీసం పాఠశాలలను తనిఖీ చే యడం లేదు. ఆన్లైన్ తరగతుల నిర్వహణ ఎలా జరుగుతుందనే దానిపై కూడా దృష్టిసారించడం లేదు. జబర్దస్త్‌గా ఫీజు వసూలు అసలే కరోనా సమయం.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు.. అయినా కొన్ని విద్యాసంస్థలు మాత్రం ఫీజులు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నాయి. ఫీజు కడితేనే ఆన్లైన్ క్లాసులకు అనుమతిస్తున్నారు. ఈనేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనే ఆలోచనతో విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు కట్టిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఫీజులు పెంచకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. గత నెలరోజుల నుంచి ఫీజుల వసూళ్లపై దృష్టి సారించారు. మెస్సెజ్‌లు పెడుతూ, నేరుగా ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు కరోనా నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని, కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలు బేఖాతరు అవుతున్నాయి. జీవో నం.46 ప్రకారం పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు తప్ప ఎలాంటి ఫీజులు తీసుకోవద్దని ఆదేశాలు ఉన్నా ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు అమలు చేయడం లేదు. ఆన్లైన్ క్లాసుల పేరిట దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించాలి. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. – జూపాక శ్రీనివాస్,పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జీవో ప్రకారం వసూలు చేయాలి జీవో నం.46 ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రతీనెల ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. అధిక ఫీజుల విషయంపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే దృష్టిసారిస్తాం. – జనార్దన్‌రావు, డీఈవో చదవండి: వారికి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి -
కార్పొరేట్లో అంతే..!
-
స్కూల్ ఫీజులు.. మధుమిత కంటతడి
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కాలంలోనూ ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు పాఠశాలలు దోచుకుంటున్నాయని ప్రముఖ నటుడు శివ బాలాజీ మరోసారి గళమెత్తారు. కార్పొరేట్ స్కూళ్ల దోపిడీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాఠశాల యాజమాన్యాలు ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శివబాలాజీ మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోయారని, ఇలాంటి విపత్కరణమైన పరిస్థితుల్లో స్కూళ్ల ఫీజులు కట్టాలని ఒత్తిడి పెట్టడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల ఐడీలు తొలగిస్తున్నారని, వ్యక్తిగతంగా ఈ మెయిల్స్ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాలాజీ వాపోయారు. నగరంలోని మౌంట్ లితేరా స్కూలు నుంచి తొలుత ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయని, ఆ తరువాత అనేక స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి మొదలైదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలన్నీ సిండికేట్ అయ్యాయని ఆరోపించారు. ప్రతి ఒక్క పేరెంట్ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తన పోరాటానికి వారంతా సపోర్టు చేయాలని కోరారు. మధుమిత కన్నీంటి పర్యంతం.. ‘ముఖ్యమంత్రి మీద గౌరవంగా అడుగుతున్నాం. మౌంట్ లిటేరా స్కూళ్లు ఫీజులతో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని మీరు చెప్పిన స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో క్షోభకు గురిచేస్తున్నాయి. మేము ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించాం. ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనివ్వటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి’ అని మధుమిత కోరారు. కాగా నగరంలోని మౌంట్ లిటేరా యాజమాన్యంపై శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) ఇదివరకే స్పందించిన విషయం తెలిసిందే. మౌంట్ లిటేరా స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. కాగా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని శివ బాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజులు తగ్గించుకోమన్నందుకు ఆన్లైన్ తరగతుల నుంచి తమ పిల్లలను తొలగించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. -
చెప్పని చదువుకు ఫీజులు
నా పేరు శ్రీనివాస్ (పేరు మార్చాం). ఆదిలాబాద్ పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పట్టణంలోని విద్యార్థి కళాశాల సమీపంలోని ఓ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి ఇంటిపట్టునే ఉన్నాను. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పనులకు వెళ్తున్నాను. అయితే ఆన్లైన్ క్లాసుల పేరిట ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం మెస్సేజ్‌లు పంపుతోంది. ఆలస్యమైనందుకు రూ.60 చొప్పున ఫెనాల్టీ చెల్లించాలట. లేదంటే అడ్మిషన్‌ను రద్దు చేస్తామని భయపెడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే మా పిల్లల్ని పాఠశాలలో ఉంచుతారో.. లేదోనన్న భయం. చాలా మందిది ఇదే పరిస్థితి. సాక్షి, ఆదిలాబాద్: కరోనాతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మార్చి నుంచి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కొంతమంది చిరు వ్యాపారాలు చేస్తుండటం, మరికొంత మంది కూలీ పనులకు వెళ్లిన విషయం విదితమే. అయితే ఆ సమయంలో విద్యాసంస్థలు బంద్ పాటించగా ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెప్పని చదువులకు సైతం ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబాలను పోషించేందుకు అష్టకష్టాలు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఫీజులు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన సాగుతోంది. ఇదివరకే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ఇంకా ఆన్లైన్ చదువులు ప్రారంభించలేదు. గత మార్చి నుంచి ఆగస్టు వరకు ఫీజు చెల్లించాలని, ఆలస్యమైనందుకు ఫెనాల్టీతో సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా బాగున్న వారు ఈ ఫీజులు చెల్లిస్తుండగా, ప్రైవేట్ ఉద్యోగులు, కూలీనాలి చేసేవారు ఫీజులు ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పని చదువుకు ఫీజు లాక్డౌన్ సమయంలో మార్చి 15 నుంచే పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వం విద్యార్థులందరిని అప్‌గ్రేడ్ చేస్తూ పైతరగతులకు పంపించింది. జిల్లాలో వందకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా. కొన్ని పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు మే నుంచి ఆగస్టు వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాయి. మరికొన్ని ఎలాంటి తరగతులు నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం ఆన్లైన్ తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా ఈ తతంగం నడిపారు. ఆన్లైన్ తరగతుల ఫీజుల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసిన టీచర్లకు కూడా వేతనాలు ఇవ్వని యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. రెండు నెలల నుంచి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెస్సేజ్‌లు పంపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు ఏమాత్రం పాటించకపోయినా ఫీజు జులుం మాత్రం మానడం లేదు. నిబంధనల ప్రకారం పాఠశాలలకు క్రీడా మైదానం, లైబ్రరీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, ఫైర్ అనుమతి, తదితర సౌకర్యాలు ఉండాలి. దీనికి తోడు పాఠశాలల్లోనే షూలు, బెల్టులు, యూనిఫాం, నోటుబుక్లు, పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. వీరి ఇబ్బందులతో తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు. పెనాల్టీ చెల్లించాలి నెలనెలా ఫీజులు చెల్లించకపోతే జీఓ ప్రకారం ఫెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మా యాజమాన్యం ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెస్సేజ్‌లు పంపించాం. ఏవైన ఇబ్బందులు ఉంటే మమ్మల్ని పాఠశాలలో సంప్రదించాలి. వి ద్యార్థుల తల్లిదండ్రులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదు. ఇది వరకు ఫీజులు అడగలేదు కాని, ప్రస్తుతం ఫీజులు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. -ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మెమో జారీ చేస్తాం ఆ పాఠశాల యాజమాన్యానికి మెమో జారీ చేస్తాం. ఫెనాల్టీ ద్వారా ఫీజులు వసూలు చేస్తే సహించేది లేదు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేయండి. – ఎ.రవీందర్ రెడ్డి, డీఈఓ -
ప్రైవేటు స్కూళ్లపై విద్యాశాఖ కొరడా
-
ఆన్లైన్ క్లాస్.. ఫీజులపైనే స్కూళ్ల దృష్టి
షాపింగ్..ఫుడ్ ఆర్డర్..టికెట్ బుకింగ్..ఇలా అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. ఇపుడు ఈ కోవలోకి క్లాసెస్ కూడా వచ్చిచేరాయి. కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడే పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం లేకపోవడంతో పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి. అయితే ఈ ఆన్లైన్ చదువుల వల్ల విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఓ సర్వేలో తేలింది. అనేకమంది వెన్ను, కంటి, నిద్రలేమి తదితర సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడైంది. సాక్షి, సిటీబ్యూరో: కరోనా నేపథ్యంలో నగరంలోని కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు తమ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నాయి. ఆన్లైన్ చదువుల పేరుతో కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్లపై పిల్లలు గంటల తరబడి పని చేస్తున్న సమయంలో ఎర్గోనామిక్స్ (సౌకర్యవంతమైన స్థితి)పై తల్లిదండ్రులకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశంపై ప్రొఫెసర్ భక్తీయార్ చౌదరి, అషద్ భక్తియార్ చౌదరి, సహేరా జమాల్, సనాజమాల్లు ఇటీవల ఓ ఆన్లైన్ సర్వే నిర్వహించారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు పిల్లలు కూర్చొనే స్థితి? వ్యవధి?నేలపై కాళ్లను తాకించి కూర్చొనే స్థితి? కీబోర్డు, మౌస్‌ల స్థితి, పని చేసే సమయంలో మధ్యలో తీసుకునే విరామం వంటి అంశాలపై ప్రశ్నావళిని రూపొందించి 10 నుంచి 17 ఏళ్లలోపు వయసుగల 186 మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించగా విస్తుగొలిపే వాస్తవాలు బయటికి వచ్చాయి. సరైన భంగిమలో పిల్లలు కూర్చోకపోవడం వల్ల వారికి రిపిటేటీవ్ స్ట్రెయిన్ ఇంజురీ(ఆర్ఎస్ఐ), క్యుములేటివ్ ట్రామా డిజార్డర్స్(సీటీడీ), మస్కులో స్కెలిటల్ డిజార్డర్స్(ఎంఎస్డీ) వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. స్కూళ్లు, టీచర్లు ఎర్గోనామిక్స్‌పై ఎప్పుడూ చెప్పలేదు. వారికి అసలు ఆ విషయంపై అవగాహన కూడా లేదని స్పష్టమైంది. సరైన స్థిలిలో కూర్చొవడంపై 6 శాతం మందికి, ఐ–మానిటర్ ఎర్గోనామిక్స్‌పై 1 శాతం మందికే అవగాహన ఉన్నట్లు తేలింది. వింటున్నది 45 శాతం మంది మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా 10, 547 పాఠశాలలు ఉండగా, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ 2500 వరకు ఉన్నాయి. వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6500 స్కూళ్లు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 31 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. నగరంలోనే 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 90 శాతం కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. మొత్తం విద్యార్థుల్లో 40 శాతం మంది ఈ స్కూళ్లలోనే చదువుతుంటారు. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న ఆయా స్కూళ్ల పిల్లల్లో 45 శాతం మంది మాత్రమే ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. కంటినిండా నిద్ర కరువు కూర్చొనే భంగిమపై వీరికి సరైన అవగాహన లేకపోవడంతో 21 శాతం మంది వెన్నముక పై భాగంలో నొప్పితో బాధపడుతుంటే...మరో 18 శాతం మంది వెన్నెముక కింది భాగంలో నొప్పిని ఎదుర్కొంటున్నారు. 13 శాతం మంది కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, నొప్పిని ఎదుర్కొంటున్నారు. 11 శాతం మంది పిల్లలు తలనొప్పితో బాధపడుతూ కనీసం కంటినిండా నిద్రకూడా పోవడం లేదు. 6 శాతం మంది అనవసరంగా కోపానికి గురవుతున్నారు. ఆన్లైన్ పాఠాలు పేరుతో గాడ్జెట్లను వినియోగిస్తున్న పిల్లల్లో 35 శాతం మంది గేమ్స్, వినోద అంశాలను వీక్షిస్తున్నారు. 20 శాతం మంది ఇతర అంశాలను వీక్షిస్తున్నట్లు తేలింది. ఇదో కొత్త వ్యాపారం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో స్కూళ్ల రీ ఓపెన్‌పై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పునఃప్రారంభం అవుతాయా? లేదా అనే అంశంపై కూడా స్పష్టత లేదు. కానీ నగరంలోకి పలు కార్పొరేట్ స్కూళ్లు ఇప్పటికే అడ్మిషన్లను పూర్తి చేశాయి. అనధికారికంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నాయి. ఆన్లైన్ చదువుల పేరుతో కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లు కొనుగోలు చేయిస్తున్నారు. నోట్‌బుక్స్, ఇతర పుస్తకాలు, స్టేషనరీ వస్తు వులను స్కూళ్లలోనే విక్రయిస్తున్నారు. పిల్లలు కంప్యూటర్ల ముందు కూర్చొని ఆన్లైన్లో పాఠాలు వినాలంటే డ్రస్కోడ్ మస్ట్ చేశాయి. అధికారికంగా స్కూళ్లు పునఃప్రారంభం కాక ముందే ఫస్ట్‌టర్మ్ ఫీజులు చెల్లించాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఫీజు చెల్లించని పిల్లలకు ఆన్లైన్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల గత మూడు నెలల నుంచి ఉపాధి అవకాశాలు లేవు. అప్పుడే ఫీజులు చెల్లించాలంటే ఎక్కడి నుంచి తెస్తామని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అవగాహన కల్పించాలి అధిక కాంతి కళ్లు త్వరగా అలిసిపోవడానికి కారణమవుతాయి. తలనొప్పి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మయోపియాకు దారి తీస్తుంది. ఎక్కువ కాలం లాక్డౌన్ వల్ల విసుగు, కోపంతో పాటు గాడ్జెట్ల నుంచి వెలువడే మైక్రోవేవ్ రేడియోషన్లు తలనొప్పి, నిద్రలేమి, చికాకు, కోపానికి కారణమవుతాయి. ఎర్గోనామిక్స్, వర్క్‌ప్లేస్ మేనేజ్మెంట్లను పాఠ్యాంశాల్లో చేర్చి....వాటి ముందు కూర్చొనే విధానంపై అవగాహన కల్పించడం ద్వారా పిల్లలను అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. – ప్రొఫెసర్ భక్తియార్ చౌదరి -
గతేడాది ఫీజులే వసూలు చేయాలి
-
కళ్లెం లేని బడులు
కడప ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయిలో ఫీజుల నియంత్రణ చర్యలు అటకెక్కాయి. ఫీజు నియంత్రణ చట్టం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోకుండా పోతోంది. చట్టం తమ చుట్టం అన్నట్టుగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలల యజమాన్యాలు అధిక ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయి. ఫీజు పట్టికలు పేపర్‌కే పరిమితమయ్యాయి తప్ప నోటీస్ బోర్డుల్లో కనిపించడం లేదు. యాజమాన్యాలకు రాజకీయ, ధనబలం ఉండటంతో ఫీజు నియంత్రణఫై సంబంధిత విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా వీటిపైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడం పేద విద్యార్థులకు శాçపంగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి. చట్టం ఏం చెబుతోంది.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి విద్యనందించాలి. బడిబయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించి ఉచితంగా నిర్బంధ విద్యనందించాలి. ప్రభుత్వ పాఠశాలలల్లోనైతే ఉచితంగా చదువుతోపాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి సౌకార్యాలు అందిస్తున్నాయి. ఉన్నత చదువులైన ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు ప్రభుత్వమే ఫీజులు నిర్ణయిస్తుంది. అయితే పాఠశాల స్థాయిలో ఫీజు నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అందినకాడికి దోచుకుంటున్నాయి. రకరకాలు పేర్లతో తల్లితండ్రులను బురడి కొట్టిస్తూ దండుకుంటున్నాయి. ఊసే లేని గవర్నింగ్ బాడీ పాఠశాలలు ఏర్పాటు చేసేటప్పుడు కచ్చితంగా ట్రస్టు పేరు పెట్టి గుర్తింపు పొందుతారు. ఇలా ఏర్పాటైన పాఠశాలకు గవర్నంగ్ బాడీని ఏర్పాటు చేయాలి. ఈ బాడీలో ట్రస్టు చైర్మన్ , కరస్పాండెంట్, హెచ్ఎం, టీచర్, పేరెంట్‌తో గవర్నింగ్‌బాడీని నియమించి, ఫీజులు ఎంత వసూలు చేయాలి, ఉపాధ్యాయులకు జీతాలు ఎంత ఇవ్వాలి తదితర అంశాలను నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది ప్రతి పాఠశాలలో అమలు కావాలి. కానీ ఎక్కడా అమలు అవుతున్న దాఖలాలు కనిపించటం లేదు. పేపర్లపై మాత్రమే గవర్నింగ్ బాడీని చూపించి మిగిలిన అన్ని పనులను యాజమాన్యం చక్కదిద్దుకుంటున్నాయి. కానరాని ఫీజు పట్టికలు ప్రతి పాఠశాలలో తరగతి వారిగా ఫీజుల వివరాలకు సంబంధించిన వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలి. అలాగే ఉపాధ్యాయుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. కానీ ఏ ఒక్క పాఠశాలలోనే ఈ పట్టికను ఏర్పాటు చేయలేదు. ఫీజు నియంత్రణ అధికారులదే అన్న భావన తల్లితండ్రుల్లో నెలకుంది. ఫలితంగా యాజామాన్యాలను ప్రశ్నించేవారే కరువయ్యారు. ఫీజుల నియంత్రణ విషయంలో అధికారులతోపాటు తల్లిదండ్రులు అడిగినప్పుడే వారిలో కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విద్యాసంవత్సరం ప్రారంభంనుంచైనా ఫీజుల పట్టికలను అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కొరుతున్నారు. -
ప్రభుత్వ విద్యకు మహర్దశ
గుంటూరు ఎడ్యుకేషన్: కొత్త ప్రభుత్వ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. వేసవి సెలవుల అనంతరం ఈనెల 12న పునఃప్రారంభం కానుండటంతో స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాం వేగవంతమైంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించిన ఫలితంగా, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లాలోని సర్వశిక్షా అభియాన్, జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు అందాయి. బూట్ల పంపిణీకి శ్రీకారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మండల పరిషత్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ మోడల్ హైస్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన ఉచిత విద్యా బోధనతో పాటు యూనిఫాం, పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఏడాది నుంచి బూట్లు కూడా అందించనున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు రోజూ పాఠశాలలకు చేరుకునేందుకు ఇళ్ల వద్ద నుంచి సగటున కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల వరకూ నడవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఉచితంగా అందజేసిన యూనిఫాం ధరించి పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనంపై ఆధారపడి వస్తున్న విద్యార్థులు కొందరు కాళ్లకు చెప్పులు సైతం ధరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సైతం ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగా నీట్‌గా బూట్లు ధరించి ఆనందంగా వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 3,155 ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న 2,51,609 మంది విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన తరువాత ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు పంపిణీ చేస్తారు. వీరిలో 1,23,953 మంది బాలురు, 1,27,656 మంది బాలికలు ఉన్నారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి నుంచి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఒక జత చొప్పున బూట్లు, రెండు జతల సాక్సులు పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. బూట్లు, సాక్సులు పంపిణీకి ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. 254 చొప్పున ఖర్చు చేస్తోంది. ఇకపై మూడు జతల చొప్పున యూనిఫాం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకూ రెండు జతల చొప్పున అందజేస్తూ వచ్చిన యూనిఫాంను ఈనెల 12న పాఠశాలలు తెరిచిన తరువాత మూడు జతల చొప్పున అందజేసేందుకు నిర్ణయించారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా 3,562 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,57,464 మంది విద్యార్థులకు యూనిఫాం అందజేయనున్నారు. ఒక్కో జతకు రూ.200 చొప్పున మూడు జతలకు రూ.600 ఖర్చు చేస్తున్నారు. క్లాత్ రూపంలో కాకుండా సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా విద్యార్థుల కొలతలను తీసుకుని మంగళగిరిలోని వివిధ గార్మెంట్ సంస్థల్లో స్టిచ్చింగ్ చేస్తున్నారు. మండల పరిషత్, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ, కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ, ఏపీ మోడల్ హైస్కూళ్లలో 6,7,8 తరగతులకు, 19 మదర్సాల్లోని 2,483 మంది చొప్పున విద్యార్థులకు మూడు జతల చొప్పున ప్రభుత్వం ఉచిత యూనిఫాం పంపిణీ చేయనుంది. 8, 9 తరగతుల విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో 8,9 తరగతులు చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు 6,7 తరగతుల విద్యార్థులకు రవాణా ఖర్చుల కింద అందజేస్తున్న మొత్తాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో సైకిళ్ల రూపంలో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలు సిద్థం ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ విధంగా జిల్లాలోని 3,248 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 19,68,161 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, గతేడాది జిల్లా పాఠ్య పుస్తక గోదాములో నిల్వ ఉన్న 2,05,489 పుస్తకాలు పోనూ మిగిలిన 17,02,059 టైటిళ్లకు ఎంఈవోలు ఆన్లైన్లో ఇండెంట్ పంపారు. ప్రభుత్వం నుంచి ఎప్పటి కప్పుడు వచ్చిన పాఠ్య పుస్తకాలను 57 మండలాల వారీగా ఎంఈవో కార్యాలయాలకు పంపారు. వాటిని స్కూల్ కాంప్లెక్స్‌లకు పంపడం ప్రారంభించారు. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పాఠ్య పుస్తకాలు ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మండలాల వారీగా ఎంఈవోలు ఆన్లైన్లో ఇండెంట్ పంపారు. దాని ఆధారంగా ముద్రణ కేంద్రాల నుంచి జిల్లాకు వస్తున్న పాఠ్య పుస్తకాలను ఎప్పటి కప్పుడు మండల పాయింట్లకు చేరవేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 3,562ప్రభుత్వపాఠశాలల్లోని2,57,464మంది విద్యార్థులకు యూనిఫాం అందజేయనున్నారు.జిల్లాలోని 3,155 ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి నుంచిచదువుతున్న 2,51,609 మందివిద్యార్థులకు పాఠశాలలు తెరిచిన తరువాత ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు పంపిణీ చేస్తారు. జిల్లావ్యాప్తంగా 3,248 పాఠశాలలోని విద్యార్థులకు 19,68,161 పాఠ్యపుస్తకాలు అవసరం. గతేడాది జిల్లా పాఠ్య పుస్తక గోదాములో నిల్వ ఉన్న2,05,489 పుస్తకాలు పోనూ మిగిలిన 17,02,059 టైటిళ్లకు ఎంఈవోలుఆన్లైన్లో ఇండెంట్ పంపారు. పాఠశాలల ప్రాంగణాలను ఆహ్లాదకరంగాతీర్చిదిద్దేందుకు నిర్ణయం మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యతతో అందించేందుకు పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులతో పాటు ఏజెన్సీల నిర్వాహకులకు కచ్చితమైన మార్గదర్శకాలు ఇచ్చాం. ఎంఈవోల పర్యవేక్షణలో పథకాన్ని సమర్థంగా నిర్వహిస్తాం. దీంతో పాటు మౌలిక వసతుల కల్పన, గోడలకు రంగులు వేయించడం వంటి కార్యక్రమాలను రూపొందించి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం.–ఆర్.ఎస్ గంగా భవానీ, జిల్లా విద్యాశాఖాధికారి -
స్కూల్ ఫీజుల నియంత్రణ ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాల గతేడాది ఒకటో తరగతికి రూ.45 వేలు వసూలు చేయగా, ఇపుడు ఆ విద్యార్థి రెండో తరగతికి వచ్చేసరికి రూ.53 వేలకు పెంచింది. కరీంనగర్‌లోని మరో ప్రైవేటు పాఠశాలలో గతేడాది ఎల్కేజీకి రూ.25 వేలు వసూలు చేయగా, ఈ సారి రూ.32 వేలకు పెంచుతున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఈ రెండు పాఠశాలలే కాదు రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాలలన్నీ 15 శాతం నుంచి 25 శాతం వరకు ఫీజులు పెంచాయి. ప్రభుత్వం వద్దన్నా.. కోర్టులో కేసు ఉన్నా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతుల్లోనే 25 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. ఇతర తరగతుల్లోనూ ఫీజులను పెంచి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాయి. ఏటా రాష్ట్రంలో స్కూల్ ఫీజులను యాజమాన్యాలు భారీగా పెంచుతున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేకపోతోంది. న్యాయ వివాదాలు ఇతరత్రా కారణాలతో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఒక్కోసారి ఒక్కో కారణంతో.. రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ ఒక్కోసారి ఒక్కో కారణంతో ఆగుతోంది. 2017 జూన్ నుంచి ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టేలా పాఠశాల విద్యా శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, మార్గదర్శకాలు రూపొందించింది. అందులో జీవో–1 అమలుకు పక్కా చర్యలు చేపట్టేలా సిఫారసులు చేసింది. ఆ ఫైలును ఆమోదం కోసం 2016 డిసెంబర్లోనే ప్రభుత్వానికి పంపింది. అయితే ప్రభుత్వం దాన్ని పరిశీలించి శాస్త్రీయంగా ఫీజులు ఖరారు చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని 2017 ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించేందుకు అధిక సమయం పట్టింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరిలో కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై కోర్టుకు.. ప్రైవేటు పాఠశాలల్లో పీజుల నియంత్రణకు ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. గతేడాది తిరుపతిరావు కమిటీ నివేదికను పరిశీలించి, న్యాయ సలహా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫీజుల ఖరారు ఆలస్యం అవుతోందని భావించి ప్రైవేటు పాఠశాలలు 2018–19 విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచొద్దని అప్పటి విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. అనేక యజమాన్యాలు ఆ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, తిరుపతిరావు కమిటీ నివేదికపై పరిశీలన జరుపుతున్నామని ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే దానిపై తీర్పు ఇంకా వెలువడలేదు. దీంతో తాజాగా మళ్లీ ఫీజులు పెంచేందుకు ప్రైవేటు పాఠశాలలు ప్రయత్నిస్తున్నాయి. చెడు పేరు వస్తుందనే.. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు ఏటా ఫీజులను 10 శాతంలోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ చేసిన సిఫారసు కారణంగా ఆ నివేదికను ప్రభుత్వం పక్కన పడేసినట్లు తెలిసింది. అది ఫీజుల పెంపును సమర్థిస్తున్నట్లు ఉండటంతో దాన్ని ఆమోదిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనతో ఆ నివేదికను పక్కనపెట్టింది. అనుమతి లేకుండా ఏటా 10 శాతం ఫీజులను పెంచుకునేలా ఎలా సిఫారసు చేశారంటూ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం ప్రశ్నించింది. ద్రవ్యోల్బణం ఆధారంగా దాన్ని సిఫారసు చేసినట్లు, ఫీజులు ఎక్కువ ఉన్నాయని భావిస్తే విద్యా శాఖ అధికారులు పరిశీలించేలా సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది. -
ఇంటర్నల్ మార్కుల్లో ప్రైవేట్ పడగ
-
పుస్తెలు తాకట్టుపెట్టి ఫీజులు కట్టినం
హుస్నాబాద్‌రూరల్ మెదక్ : పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని పుస్తెలు తాడు తాకట్టుపెట్టి హుస్నాబాద్ ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి రూ. 30వేల ఫీజు కట్టిన.. మా పిల్లలకు నూకల బువ్వ, నీళ్ల చారు, పురుగులు పడ్డ దొడ్డు బియ్యం కూడు పెడతారా..? అని అంకుషాపూర్‌కు చెందిన రేణుక పాఠశాల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఎండకాలంలో టీచరమ్మలు మా తండాకు వచ్చి మంచి చదువులు చెప్తం.. హాస్టల్లో ఉంచుతాం అని మాయ మాటలు చెప్తే పిల్లగాడిని హాస్టల్లో చేర్చిన.. ఇప్పుడు రాత్రి పూట పురుగులు పడ్డ బువ్వ తినకపోతే సార్లు కట్టెలతో కొడుతున్నరని మా కొడుకు ఏడువబట్టేనని పాఠశాల రేణుక కన్నీరు పెట్టుకుంది. హుస్నాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30వేల ఫీజు వసూలు చేసింది. గిరిజన పిల్లల వద్ద ఫీజులు తీసుకున్న యాజమాన్యం విద్యార్థులకు చదువులు చెప్పకపోగా, పురుగులు పడిన నూకల బువ్వ, నీళ్ల చారు పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు వడ్డించే భోజనం, పురుగులు పట్టిన బియ్యం బయట వేసి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. మా ఫీజులు తిరిగిచ్చి మా పిల్లలను మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో హుస్నాబాద్, కోహెడ ఎస్సైలు సుధాకర్, సతీష్‌లు అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న పిల్లల తల్లిదండ్రుల సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల యాజమాన్యం సమక్షంలోనే విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. పిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వడం భావ్యం కాదని మందలించారు. పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పాఠశాలపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. దీంతో ఆందోళనకారులు కేసులు కాకుండా మా ఫీజులు మాకు ఇచ్చి మా పిల్లలను అప్పగించి న్యాయం చేయాలని వేడుకున్నారు. మా అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇంగ్లిష్ చదువుల పేరుతో పిల్లలను చేర్చుకున్నట్లు గిరిజనులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూకల బువ్వ తినకపోతే కొడుతరు పురుగులు పడ్డ నూకల బువ్వ తినకపోతే సార్లు కర్రతో కొడుతరు. నీళ్ల చారు పెడుతరు. హాస్టలు విషయాలు ఇంటికాడ చెప్పితే కొడుతమని బెదిరిస్తున్నారు. మా ఫ్రెండ్‌ను కర్రతో కొడుతే చేతులకు వాతలు వచ్చినై. మాకు బోరు నీళ్లు ఇస్తరు.. సార్లు క్యాన్ నీళ్లు తాగుతరు. – శరత్‌కుమార్, 4వ తరగతి -
ప్రైవేటు దోపిడీని అరికట్టాలి : ఎస్ఎఫ్ఐ
వికారాబాద్ అర్బన్: ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో గురువారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. సామాన్యులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. కార్పొరేట్ పేరుతో పాఠశాలలు, కళాశాలలు లక్షల ఫీజులు వసూలూ చేస్తున్నట్లు తెలిపారు. కేజీ టూ ఫీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానన్న కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. రూ.వేల కోట్ల రూపాయల ఆస్తులను దక్కించుకునేందుకు ప్రభుత్వం ఈ రకమైన కుట్రను చేస్తుందన్నారు. వికారాబాద్‌లోని శ్రీ అనంతపద్మనాభ వంటి ఎయిడెడ్ కళాశాల అందరి సహకారంలో ఏర్పడిందన్నారు. ఈ ప్రాంత రైతులు ధాన్యం అమ్మినప్పుడు కొంత డబ్బు కళాశాల కోసం వెచ్చించారని, ఇప్పుడు ప్రైవేటు చేస్తే ఆ ఆస్తి పూర్తిగా అక్రమార్కుల చేతులోకి పోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. యూజీసీని రద్దు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. యూజీసీ రద్దు చేస్తే దాదాపుగా ప్రభుత్వ పరమైన విద్య ఆగిపోయినట్లే అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ ఆందోళన చేస్తుందన్నారు. బంద్ నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీపై వదిలిపెట్టారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మహేందర్ పాల్గొన్నారు. -
ప్రైవేట్ స్కూల్ ఫీజులకు అడ్డు పడేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం తెచ్చే అంశంలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఫీజుల నియంత్రణకు ఎన్నిసార్లు ఉత్తర్వులు జారీ చేసినా, యాజమాన్యాలు వాటిపై కోర్టును ఆశ్రయించడం, అవి రద్దు కావడం జరుగుతోంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచించినట్లు తెలిసింది. గతంలో డీఎఫ్ఆర్సీల ఏర్పాటు విధానం సరిగ్గా లేదని కోర్టు కొట్టేసిన నేపథ్యంలో తాజాగా.. ఓవైపు డీఎఫ్‌ఆర్‌సీలకు చట్టబద్ధత కల్పిస్తూనే రాష్ట్రస్థాయిలో ఏఎఫ్ఆర్సీని ఏర్పాటు చేయాలని యోచించింది. ఈమేరకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెడతారా? లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఫీజుల నియంత్రణ విధానాలను ఖరారు చేసేందుకు నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ కాల పరిమితిని ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. అధ్యయనం చేసే సమయం ఇంకా ఉండటంతో ఫీజుల నియంత్రణ బిల్లును ఇప్పుడే ప్రవేశ పెట్టే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నారు. -
ఏటా 10 శాతం పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు ఎలాంటి అనుమతి లేకుండానే ఏటా 10 శాతం వరకు ఫీజులు పెంచుకోవచ్చని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రతిపాదించింది. అంతకంటే ఎక్కువగా ఫీజులను పెంచుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించింది. 2016–17 విద్యా సంవత్సరం నాటికి ఉన్న ఫీజులను ప్రమాణికంగా కొత్త నిబంధనలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పాఠశాలల ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఫీజులకు అనుమతినిచ్చేందుకు జోనల్ ఫీజు నియంత్రణ కమిటీలను (జెడ్ఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ నివేదికను శనివారం ప్రభుత్వానికి అందజేయనుంది. అయితే ఈ నివేదికలోని అంశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనివల్ల ఫీజుల తగ్గింపు ఉండకపోగా.. ప్రైవేటు యాజమాన్యాల దోపిడీకి మరింత అవకాశమిస్తుందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఫీజుల తగ్గింపునకు అవకాశమేదీ? రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అంశంపై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల కమిటీలు, సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో చర్చించిన కమిటీ.. శుక్రవారం చివరి సమావేశం నిర్వహించింది. వివిధ అంశాలపై మరోసారి చర్చించింది. అనంతరం ఫీజుల అంశంపై నివేదికను సిద్ధం చేసింది. దీనిని శనివారం ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ప్రొఫెసర్ తిరుపతిరావు వెల్లడించారు. అయితే నివేదికలోని అంశాలపై తల్లిదండ్రుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇప్పటికే అడ్డగోలుగా ఉన్న ఫీజుల తగ్గింపునకు చర్యలు ఏవని ప్రశ్నించాయి. పాఠశాలలు ఆదాయ, వ్యయాలను పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే.. వాటిని క్షుణ్నంగా పరిశీలించి చర్యలు చేపట్టాలన్న సిఫారసు లేదని పేర్కొన్నాయి. అడ్డగోలుగా పెంచుతున్నారన్న ఫిర్యాదుల మేరకే.. రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రైవేటు స్కూళ్లు ఏటా 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే కొత్త విధానాన్ని సిఫారసు చేస్తున్నాం. రాష్ట్రంలో పాఠశాలల ఫీజులపై ఇప్పటివరకు ఒక విధానమంటూ లేదు. ఇప్పుడు నియంత్రణలోకి తెచ్చే చర్యలు చేపట్టాం. ప్రతి పాఠశాల గత మూడేళ్ల ఆదాయ, వ్యయాల వివరాలివ్వాలని సూచించాం. రాష్ట్రంలో 12 వేల పాఠశాలలుంటే.. 4 వేలకు పైగా పాఠశాలలే నివేదికలు ఇచ్చాయి. మిగతావి ఇవ్వాల్సి ఉంది. విద్యాశాఖ ఆ నివేదికలను పరిశీలించి తగిన చర్యలు చేపడుతుంది. మేం రూ.12 వేల ఫీజు ఉన్న స్కూళ్ల నుంచి రూ.2.5 లక్షల ఫీజున్న స్కూళ్ల వరకు తనిఖీ చేశాం. రెండింటి మధ్య వసతుల్లో చాలా తేడా ఉంది. అయితే వారు లాభాలు గడిస్తున్నారా, లేదా? అన్నది వేరే విషయం. లాభాలు గడిస్తే ఫిర్యాదు చేయవచ్చు. దానిపై విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టాలి. మేమిచ్చే సిఫార్సులపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది. 45 రోజుల్లో ఫీజు చెల్లించకపోతే టీసీ ఇచ్చేయవచ్చన్న నిబంధనను పెట్టలేదు.. – ప్రొఫెసర్ తిరుపతిరావు ఇది ఫీజుల దందాకు గ్రీన్‌సిగ్నల్ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందాకు తిరుపతిరావు కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్కూళ్ల యాజమాన్యాలకు కొమ్ముకాసింది. మహారాష్ట్రలో రెండేళ్లకోసారి 15 శాతమే పెంచుకోవచ్చు. ఇక్కడ ఏటా 10 శాతానికి అనుమతినిచ్చారు. అంతేకాదు జోనల్ కమిటీకి వెళ్లి ఇంకా అధికంగా ఫీజు పెంచుకోవచ్చు. శ్లాబ్ విధానానికీ కమిటీ ఓకే చెప్పింది. అంటే ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్తే 10 శాతం ఫీజు పెంపు.. అదే ఒకటో తరగతికి వెళితే శ్లాబ్ మారిపోయి. 40–50 శాతం ఫీజులు పెరిగే అవకాశముంటుంది. ఇప్పటికే అనేక స్కూళ్లు రూ.లక్షల్లో డొనేషన్లు తీసుకున్నాయి. అధిక ఫీజులు ఉన్నాయి. వాటికి ఫీజులు పెంచుకోవాల్సిన అవసరమే లేదు. ఇక నియంత్రణ ఎక్కడుంది. శాస్త్రీయత ఎక్కడుంది. పాఠశాలల ఆదాయంలో 50 శాతాన్ని టీచర్లకు వేతనాలుగా ఇవ్వాలన్న అంశాన్ని పట్టించుకోలేదు. తల్లిదండ్రులకు, టీచర్లకు రక్షణ లేదు. మరణ శాసనం రాశారు. ఈ నివేదికను మేం ఖండిస్తున్నాం.. – ఆశిష్ నేరెడి, హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఫీజుల తగ్గింపునకు చర్యలేవీ? ఏటా 10 శాతం ఫీజు పెంచుకోవచ్చన్న ప్రతిపాదన దారుణం. ఇప్పటికే లక్షల్లో ఫీజులు దండుకుంటుకున్న కార్పొరేట్ స్కూళ్లకే అది మేలు చేస్తుంది. ఫీజుల నియంత్రణకు రాష్ట్రస్థాయి కమిటీ లేకుండా జోనల్ కమిటీల వల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రైవేట్ స్కూళ్ల విధివిధానాలపై గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో–1లోని నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. దీంతో విద్యా వ్యాపారం ఇంకా పెరుగుతుంది. ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి. మూడేళ్లకోసారి ఫీజులు నిర్ణయించాలని గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేయాలి.. – నాగటి నారాయణ, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం కమిటీ నివేదికలో ప్రధాన అంశాలివీ.. - ద్రవ్యోల్బణం ప్రకారం ఏటా గరిష్టంగా 10 శాతం వరకు ఫీజులను పెంచుకోవచ్చు. ఇందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. - 10 శాతం కంటే ఎక్కువ ఫీజు పెంచుకోవాలంటే అనుమతి తీసుకోవాలి. ఇందుకు జెడ్ఎఫ్ఆర్సీలను ఏర్పాటు చేయాలి. పాఠశాలలు వాటికి ఆడి ట్ నివేదికలను అందజేసి, అనుమతి తీసుకోవాలి. - స్కూళ్లు 10 శాతం ఫీజులు పెంచినా, పెంచకపోయినా.. ఎక్కువ లాభాలు గడిస్తున్నట్లయితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. - అనధికారికంగా ఫీజులను పెంచితే జిల్లాల్లో డీఈవోకు, కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలి. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. - అన్ని పాఠశాలల ఆడిట్ చేసిన ఆదాయ, వ్యయాల లెక్కలను ప్రభుత్వ పోర్టల్‌లో పెట్టాలి. - ఇలా వివరాలను అందుబాటులోకి తీసుకురాని స్కూళ్లకు ఆ ఏడాది ఫీజుల పెంపునకు అనుమతించవద్దు. తర్వాతి ఏడాది కూడా వివరాలు బహిరంగపర్చకపోతే వాటి గుర్తింపును రద్దు చేయాలి. - తప్పుడు ఆడిట్ నివేదికలను పొందుపరిస్తే విద్యాశాఖ ఏక సభ్య కమిషన్‌తో విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. - 2016–17 విద్యా సంవత్సరంలో నిర్ణయించిన ఫీజులే ప్రామాణికంగా కొత్త ఫీజుల విధానం ఉంటుంది. - ఇప్పుడున్న ఫీజులను పెంచినా, పెంచకపోయినా.. ప్రస్తుతం అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖ గుర్తిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు చేపట్టవచ్చు. - డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేయవద్దు. - ఆన్లైన్లో ప్రవేశాలు చేపట్టాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. - పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి సంబంధిత బోర్డుల నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలి. -
ఫీజుల వివరాలివ్వండి: సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: తమ ఫీజుల విధానాన్ని, గత ఐదేళ్లలో పెంచిన ఫీజుల వివరాలను అందజేయాలని ప్రైవేట్ స్కూళ్లను సీబీఎస్ఈ ఆదేశించింది. పాఠశాల పరిసరాల్లో పుస్తకాలు, యూనిఫాంలను అమ్ముతూ ప్రైవేట్ స్కూళ్లు ‘దుకాణాలు’గా మారిపోయాయంటూ సీబీఎస్ఈ ఇటీవల విమర్శించడం తెలిసిందే. ‘అసంబద్ధంగా ఫీజులు వసూలు చేయొద్దని అన్ని స్కూళ్లను ఆదేశించాం. స్పందించకుంటే తగిన చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.