మాల్యా బ్యాంకు బకాయిల వివరాలివి
ముంబై: కింగ్ ఫిషర్ అధిపతి విజయ్ మాల్యాకు ఎట్టకేలకు ఇంటర్ పోల్ చెక్ పెట్టింది. లండన్ లో మంగళవారం అరెస్ట్ చేసింది. అయితే వేలకోట్లను ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాను భారత్ కు రప్పించే క్రమంలో కీలక అడుగు పడింది. ఈ అరెస్ట్ ను మాల్యా చాలెంజ్ చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. బెయిల్‌కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే రుణాల రికవరీ కి సుదీర్ఘ కాలం పట్టే అవకాశం ఉన్నప్పటికీ మాల్యా అరెస్ట్ కీలక పరిణామమని చెప్పారు.
అయితే ఉద్దేశ పూర్వక లోన్ డిఫాల్టర్‌గా ప్రకటించిన విజయ్ మాల్యా సుమారు 17 బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు ఇలా ఉన్నాయి.
బ్యాంకులకు విజయ్ మాల్యా బకాయిలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1650 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 800 కోట్లు
ఐడీబీఐ బ్యాంక్ రూ. 800 కోట్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 650 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 550 కోట్లు
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 430 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 410 కోట్లు
యూకో బ్యాంక్ రూ. 320 కోట్లు
కార్పొరేషన్ బ్యాంక్ రూ. 310 కోట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ రూ. 150 కోట్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ. 140 కోట్లు
ఫెడరల్ బ్యాంక్ రూ. 90 కోట్లు
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ రూ. 60 కోట్లు
యాక్సిస్ బ్యాంక్ రూ. 50 కోట్లు
మరో 3 బ్యాంకింగ్ సంస్థలకు రూ. 603 కోట్లు
మొత్తం రూ. 6963 కోట్లను విజయ్ మాల్యా బ్యాంకులకు బకాయిపడగా.. వడ్డీలు, పెనాల్టీలతో కలిపితే రూ. 9వేల కోట్లకు పైమాటే.