'ముందుగా దాడి చేయం.. కానీ' | We will not be the first to strike, but if we are hit: Rajnath Singh | Sakshi
Sakshi News home page

'ముందుగా దాడి చేయం... కానీ'

Published Mon, Jul 27 2015 2:18 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

'ముందుగా దాడి చేయం.. కానీ'

'ముందుగా దాడి చేయం.. కానీ'

న్యూఢిల్లీ: పాకిస్థాన్ తో శాంతి సంబంధాలు కోరుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అయితే తమ దేశ గౌరవానికి భంగం వాటిల్లితే సహించబోమని స్పష్టం చేశారు. తమకు తాముగా కయ్యానికి కాలు దువ్వబోమని చెప్పారు.

తాము ఎవరిపై ముందుగా దాడి చేయబోమని, తమపై ఎవరైనా దాడికి దిగితే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నా పదే పదే సరిహద్దు ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతున్నాయో తనకు అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement