ఈ ప్రమాదాలు ఆగేదెన్నడు: వైఎస్ జగన్ | when can we put an end to such accidents?, says ys jagan | Sakshi
Sakshi News home page

ఈ ప్రమాదాలు ఆగేదెన్నడు: వైఎస్ జగన్

Published Mon, Aug 24 2015 6:23 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ఈ ప్రమాదాలు ఆగేదెన్నడు: వైఎస్ జగన్ - Sakshi

ఈ ప్రమాదాలు ఆగేదెన్నడు: వైఎస్ జగన్

హైదరాబాద్: అనంతపురం జిల్లాలో సోమవారం జరిగిన రైలు ప్రమాదంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతపురం జిల్లాలో ఈ తరహా రైలు ప్రమాదం మూడోదని ట్విటర్ లో వైఎస్ జగన్ తెలిపారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రతిసారీ కంటితుడుపు చర్యలతో పొద్దుపుచ్చుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెనుకొండ మండలం మడకశిర వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ దేవదుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ తో పాటు ఐదుగురు మృతి చెందారు. 30 మందిపైగా గాయపడ్డారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement