పాపులర్ లీడర్ ఎవరో తెలుసా? | who is popular among Modi, Rahul, Kejriwal | Sakshi
Sakshi News home page

పాపులర్ లీడర్ ఎవరో తెలుసా?

Published Tue, Sep 20 2016 7:27 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పాపులర్ లీడర్ ఎవరో తెలుసా? - Sakshi

పాపులర్ లీడర్ ఎవరో తెలుసా?

నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఈ ముగ్గురు అగ్ర నేతలకు దేశ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నాయకులకు దేశంలో ఉన్న ప్రజాదరణపై ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. గత మే నెలలో నిర్వహించిన ఈ సర్వేలో ప్రధాని నరేంద్రమోదీ ’నమో వేవ్‌’ ఇప్పటికీ దేశంలో బలంగా ఉందని తేలింది. అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా క్రమక్రమంగా కోల్పోయిన తన ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సర్వే తెలిపింది.

ఈ సర్వే ప్రకారం నరేంద్రమోదీ...

  • 57శాతం మంది భారతీయులు ప్రధాని మోదీకి అనుకూల అభిప్రాయంతో ఉన్నారు. 57శాతం మంది ఆయనను అమితంగా అభిమానిస్తున్నారు.
  • 2015లో మోదీకి 87శాతం మంది ఈ సర్వేలో మద్దతు పలికారు.
  • అన్ని వర్గాల ప్రజల్లోనూ మోదీకి ప్రజాదరణ ఉంది.
  • మోదీ పరిపాలన పట్ల 67శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ బాగా పనిచేస్తున్నదని 80శాతం అభిప్రాయపడ్డారు. 2014లో ఇలా చెప్పినవారు 55శాతం మందే.
  • కాంగ్రెస్‌ మద్దతుదారుల్లోనూ 24శాతం మంది మోదీ పట్ల సానుకూల భావనతో ఉన్నారు.
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ మోదీకి మద్దతు బాగుంది.
  • ’నాలాంటి సామాన్య వ్యక్తులను సం​రక్షణ పట్టించుకునే వ్యక్తి మోదీ’ అంటూ 56శాతం మంది సర్వేలో పేర్కొన్నారు.
  • మోదీ తాను అనుకున్న విషయాలు చేయగల సమర్థుడు అని 51శాతం మంది అభిప్రాయపడగా.. ఆయన చేయలేరు అని 33శాతం మంది పేర్కొన్నారు.
  • ప్రజల ఐక్యతకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని 49శాతం అభిప్రాయపడగా.. విభజించి పాలిస్తున్నదని 29శాతం మంది పేర్కొన్నారు.
  • ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వ తీరుపై 61శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, అవినీతి అణచివేతపై 59శాతం, నిరోద్యోగ సమస్య పరిష్కారంపై 62శాతం, పేదల సంక్షేమంపై 62శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.


రాహుల్‌ గాంధీ...

  • 2014తో పోల్చుకుంటే రాహుల్‌గాంధీకి ప్రజాదరణ కొంతమొత్తంలో పెరుగడం గమనార్హం.
  • 63శాతం మంది రాహుల్‌పై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2013లో ఇది కేవలం 50శాతమే.
  • 85శాతం మంది కాంగ్రెస్‌ పార్టీ మద్దతు దారులు తమ నాయకుడిపై సానుకూల అభిప్రాయం కలిగి ఉన్నారని ఈ సర్వేలో తేలింది.  బీజేపీ మద్దతుదారుల్లో 52శాతం మందికి రాహుల్‌ అంటే సదభిప్రాయం ఉందని సర్వే పేర్కొంది.
  • ఇక సోనియాగాంధీ పట్ల ఇప్పటికే 65శాతం మంది భారతీయుల్లో సానుకూల అభిప్రాయం ఉంది. ఇది 2015లో 58శాతం కాగా, 2013లో 49శాతంగా ఉంది.


అరవింద్‌ కేజ్రీవాల్‌..

  • ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజాదరణ తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. 2015లో ఆయన పట్ల 60శాతం మంది సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయగా, తాజాగా 50శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు.
  • ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రజాదరణ కూడా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 47శాతం మంది మాత్రమే ఆప్‌కు మద్దతు తెలిపారు. 2015లో ఇది 58శాతంగా ఉంది. ఆప్‌కు ఢిల్లీలో అత్యధికంగా 57శాతం మంది మద్దతు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement