
గూగుల్ మనకెందుకు లేదు?
గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్ భారత్ కు ఎందుకు లేదని ఐటీ పరిశ్రమను ప్రధాని మోదీ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: సైబర్ భద్రత ప్రపంచానికి సవాల్ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీని సరైన పరిష్కారం కనుగొనాలని ఐటీ ప్రొఫెషనల్స్ ను ఆయన కోరారు. జీడీపీ వృద్ధిలో 'కనెక్టివిటీ' కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్ భారత్ కు ఎందుకు లేదని ఐటీ పరిశ్రమను ఆయన ప్రశ్నించారు.
నాస్కామ్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 25 ఏళ్ల క్రితం 100 మిలియన్ డాలర్లుగా ఉన్న ఐటీ పరిశ్రమ నేడు 146 బిలియన్ డాలర్లకు చేరిందని మోదీ తెలిపారు. పీఎంఓ మొబైల్ ఆప్ రూపొందించేందుకు ఆలోచనలు(ఐడియాలు) పంపాలని ప్రధాని కోరారు.