న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం వొకార్డ్ ఈ ఏడాది ఏకీకృత నికర లాభాల్లో నీరస పడింది. మార్జిన్లు భారీగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం లో నిరుత్సాహకర ఫలితాలు విడుదల చేసింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం దాదాపు 83 శాతం వరకూ క్షీణించి రూ. 16 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆదాయం కూడా 4 శాతం నీరసించి రూ. 1091 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇండియా వ్యాపారం 10 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధానంగా యూఎస్, వర్ధమాన మార్కెట్లలో బిజినెస్ క్షీణించడంతో లాభాలు తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఆదాయంలో 62 శాతం అంతర్జాతీయ మార్కెట్ల నుంచే లభించినట్లు కంపెనీ తెలియజేసింది. అమెరికా ఆదాయం 16 శాతం క్షీణించగా, వర్ధమాన మార్కెట్ల నుంచి కూడా ఆదాయం 16 శాతం తగ్గినట్లు వెల్లడించింది. అయితే యూకే బిజినెస్ 26 శాతం వృద్ది చూపినట్లు పేర్కొంది. ఈ కాలంలో దేశీ మార్కెట్లో 11 కొత్త ఉత్పత్తులను విడుదల చేయగా, మూడు కొత్త ఫైలింగ్స్‌ను చేపట్టామని, యూకే మార్కెట్ నుంచి ఒక ఫైలింగ్‌కు అనుమతి లభించిందని వివరించింది.
నిర్వహణ లాభం(ఇబిటా) 48.5 శాతం క్షీణించి రూ. 85 కోట్లను తాకగా, ఇబిటా మార్జిన్లు 6.7 శాతం పడిపోయి 7.8 శాతానికి చేరాయి. రూ. 10 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదయ్యాయి. ఇతర ఆదాయం మాత్రం రూ. 6.4 కోట్ల నుంచి రూ. 16.9 కోట్లకు ఎగసింది.
కాగా కంపెనీ మూడు యూనిట్లలలో తనిఖీ నివేదికలు అందాయని వొకార్డ్ చెప్పింది. అమెరికా ఫూడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ ఆరోపించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన దశలను ప్రారంభించిందని, పదార్థం పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
లాభాల్లో నీరసించిన వొకార్డ్
Published Sat, Aug 13 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
Advertisement
Advertisement