దొంగతనాన్ని ప్రతిఘటించబోయి ప్రాణాలు కోల్పోయింది | Woman murder for purse in Delhi | Sakshi
Sakshi News home page

దొంగతనాన్ని ప్రతిఘటించబోయి ప్రాణాలు కోల్పోయింది

Published Sun, Feb 16 2014 9:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

Woman murder for purse in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మహిళలకు భద్రత కరవవుతోందనే వాదనలకు బలం చేకూరుతోంది. ఒక దారుణాన్ని మరిచిపోయేలోపే మరో దారుణం చోటు చేసుకుంటోంది. తాజాగా ఢిల్లీలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. పర్సు దొంగతనం చేస్తుంటే ప్రతిఘటించిన ఓ మహిళను దుండగులు దారుణంగా పొడిచి చంపారు. ఢిల్లీ-కరోల్‌బాగ్‌లో ఈ దారుణం జరిగింది.

ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న బాధితురాలు నోయిడా నుంచి కరోల్‌భాగ్‌ వెళ్లారు. కరోల్‌భాగ్ స్టేషన్ నుంచే బాధితురాలని వెంబడించిన దుండగులు  ఇంటికి సమీపంలోకి వచ్చిన తరువాత ఆమెను అడ్డుకున్నారు. పర్సు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితురాలిపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఆమె అరిచి కేకలు పెట్టడంతో విచక్షణరహితంగా పొడిచి పరారయ్యారు. ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. కేకలు విని భవనం పైనుంచి కిందకు వచ్చే లోపే దుండగులు పొడిచి పరారరయ్యారని మృతురాలి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement