అత్యాచారం చేసి.. గొంతుకోసిన దుర్మార్గుడు | Youth rapes teenaged girl, slits throat | Sakshi
Sakshi News home page

అత్యాచారం చేసి.. గొంతుకోసిన దుర్మార్గుడు

Published Sun, Dec 22 2013 8:45 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Youth rapes teenaged girl, slits throat

పశ్చిమబెంగాల్లో దారుణం జరిగింది. ఓ యువకుడు టీనేజి యువతిపై అత్యాచారం చేసి, తర్వాత ఆమె గొంతుకోసేశాడు!! మాల్డా జిల్లాలోని ఇంగ్లీష్ బజార్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. అభయ్ మోండల్ (27) అనే వ్యక్తి సైకిల్ కొనిస్తానని చెప్పి ఓ అమ్మాయిని ఆమె ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసేశాడు. దాంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయ్యి, ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఎలాగోలా రోడ్డుమీదకు వచ్చి ఓ టీస్టాల్ వద్దకు చేరుకుంది. ఆమెను చూసిన స్థానికులు వెంటనే మాల్డా మెడికల్ కాలేజికి తరలించారు. జిల్లా ఎస్పీ కళ్యాణ్ ముఖర్జీ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కృష్ణేందు నారాయణ్ చౌదరి వెంటనే ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.  మోండల్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement