సమైక్యానికి సహకరించాలని జయకు జగన్ విజ్ఞప్తి
చెన్నై : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. కేంద్రం చేస్తున్న అడ్డుగోలు విభజనను అడ్డుకోవాలని ఆయన ఈ సందర్భంగా జయలలితను కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా జగన్... జయలలితతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక చర్యకు పాల్పడుతోందని ఆరోపించారు. అంతకుముందు చెన్నై విమానాశ్రయంలో దిగిన జగన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. దారంతా పూల వర్షం కురిపించారు. టపాకాయలు కాల్చి వైఎస్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.