ఆ రెండు పార్టీలకూ కాంగ్రెస్కు పట్టినగతే | ysrcp mp vijayasai reddy takes on tdp, bjp | Sakshi
Sakshi News home page

ఆ రెండు పార్టీలకూ కాంగ్రెస్కు పట్టినగతే

Published Fri, Aug 5 2016 7:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆ రెండు పార్టీలకూ కాంగ్రెస్కు పట్టినగతే - Sakshi

ఆ రెండు పార్టీలకూ కాంగ్రెస్కు పట్టినగతే

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీలకు చిత్తశుద్ధిలేదని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి పట్టినగతే బీజేపీ, టీడీపీలకు పడుతుందని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడంలేదని విజయసాయి రెడ్డి విమర్శించారు. కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ  శుక్రవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్లకు కాలపరిమితి విధించాలని, లేదంటే ఆ అధికారం రాష్ట్రపతికి అప్పగించాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement