జుకర్‌బర్గ్‌పై ప్రశంసల వర్షం
* ఆయన కూతురు అదృష్టవంతురాలు: మిలిండా, షకీరా
* తన వాటాలో 99 శాతం ఇచ్చినా మార్క్ వేలకోట్లకు అధిపతే!
శాన్ ఫ్రాన్సిస్కో: భవిష్యత్ తరాలకు మెరుగైన వసతుల కల్పనకు ఫేస్‌బుక్‌లోని తన వాటాలో 99 శాతం షేర్లను వినియోగించనున్నట్లు ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ప్రకటనపై ట్వీటర్, ఫేస్‌బుక్ పోస్టుల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మిలిండా గేట్స్, బ్రెజీలియన్ మీడియా ప్రముఖుడు లూసియానో హక్, పాప్‌స్టార్ షకీరా, హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌లు జుకర్‌బర్గ్ నిర్ణయాన్ని హర్షించారు. ‘మాక్స్, ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టడం నీ అదృష్టం.
ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మార్క్, ప్రిసిల్లాలకు శుభాకాంక్షలు’ అని మిలిండా స్పందించారు. ‘చిత్తశుద్ధి, సమాజసేవపై ఆసక్తి ఉన్న తల్లిదండ్రులకు పుట్టడం మాక్సిమా అదృష్టం’ అని షకీరా ప్రశంసించారు. ఫేస్‌బుక్ మొత్తం విలువ 19.63 లక్షల కోట్లు కాగా ఇందులో జుకర్‌బర్గ్ వాటా 24 శాతం. ఇందులో 99 శాతం షేర్లను (దాదాపు రూ. 3 లక్షల కోట్లు) సమాజసేవకు వినియోగిస్తానని జుకర్‌బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన వాటా లో 99 శాతం షేర్లను మార్క్ ఇచ్చేసినా ఆయన వద్ద ఇంకా 450 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3వేల కోట్లు) ఉంటాయి.
హార్వర్డ్ నుంచి ఎఫ్‌బీదాకా..
మార్క్ జుకర్‌బర్గ్..ప్రపంచ ప్రజల్ని ఒక సామాజిక వేదిక ద్వారా అనుసంధానిం చిన వ్యక్తి. బాల్యం నుంచే చదువుల్లో టాప్. పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించిన జుకర్‌బర్గ్ కమ్యూనికేషన్ టూల్స్ అభివద్ధి చేశాడు. హార్వర్డ్ వర్సిటీలో ఈయన రా సిన ‘కోర్స్ మ్యాచ్’ ‘ఫేస్‌మాష్’ అనే ప్రోగ్రామ్స్‌ను మూసి వేయటమే ‘ఫేస్‌బుక్’ రూపకల్పనకు దారి తీసింది. 2004 ఫిబ్రవరిలో తన సహచరులతో కలిసి జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారు. ఫేస్‌బుక్ ప్రారంభించినప్పటినుంచి ఈయనే సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.