హైదరాబాద్: తెలంగాణలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపడుతున్నారు. 15 శాఖల్లో 15 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. సోమవారం నోటిఫికేషన్ వివరాలతో ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 15,522 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థుల వయోపరిమితిని 10 ఏళ్లకు సడలించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ ఫైలుపై ఆదివారమే సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ రోజు నోటిఫికేషన్ వివరాలతో ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయం, వైద్యశాఖ, మున్సిపల్, విద్యుత్, ఎక్సైజ్ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్
Published Mon, Jul 27 2015 8:32 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM
Advertisement
Advertisement