విభజనను వ్యతిరేకించం, బిల్లును అడ్డుకోం: చంద్రబాబు
రాష్ట్రాన్ని విభజించిన తీరు అన్యాయంగా ఉంది అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విభజనపై మాతో చర్చించకుండా ఎలా ముందుకెళ్తారు అని చంద్రబాబు అన్నారు. కెబినెట్ ఆమోదానికి ముందు ఇరుపక్షాలను పిలవమంటే ఎందుకు పిలవలేదు అని చంద్రబాబు ప్రశ్నించారు.
విభజనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటం చేస్తాం అని ఆయన అన్నారు. తాము తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామనడం లేదు, విభజన ఆపాలనడం లేదు అని చంద్రబాబు అన్నారు. అయితే ఇరుప్రాంతాలకు న్యాయం చేయమని కోరుతున్నాం అని చంద్రబాబు అన్నారు.