23న విజయవాడ రైతు సదస్సులో దేశీ రెడ్ రైస్ విత్తనాల పంపిణీ | 23 of the Convention on the Vijayawada farmer seed distribution in the domestic Red Rice | Sakshi
Sakshi News home page

23న విజయవాడ రైతు సదస్సులో దేశీ రెడ్ రైస్ విత్తనాల పంపిణీ

Published Tue, Aug 18 2015 12:18 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

23న విజయవాడ రైతు సదస్సులో  దేశీ రెడ్ రైస్ విత్తనాల పంపిణీ - Sakshi

23న విజయవాడ రైతు సదస్సులో దేశీ రెడ్ రైస్ విత్తనాల పంపిణీ

గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్(బందర్ రోడ్డు)లో ఈ నెల 23 (ఆదివారం)న జరగనున్న సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఔషధ విలువలతో కూడిన ‘కుడవలై’ అనే దేశీ వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు సంఘం నేత కుమారస్వామి తెలిపారు (ఇది 140 రోజుల పంట. బియ్యం ఎర్రగా ఉంటాయి. రక్తహీనతను, కీళ్ల నొప్పులను తగ్గించడానికి దోహదపడుతుంది). తమిళనాడులోని ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ వద్ద నుంచి హరిత భారతి ట్రస్టు (త్రినాథ్:89770 97405) తెప్పించిన ఈ రెడ్ రైస్ విత్తనాలను రైతుకు కిలో చొప్పున అందించనున్నట్లు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్న రైతులను ఒకే గొడుగు కిందకు తేవడం.. ఈ అమృతాహారం విలువను వినియోగదారులకు తెలియజెప్పడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ విస్తృత సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు, వినియోగదారులు తరలి రావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు జరుగుతుందన్నారు. వివరాలకు..
 కుమారస్వామి-94401 27151, భూపతిరాజు రామకృష్ణంరాజు-94404 87864
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement