చేపలు నీటిలో నివసించే జీవులు కావడం వల్ల వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
చినగంజాం : చేపలు నీటిలో నివసించే జీవులు కావడం వల్ల వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చేపల్లో అనారోగ్యాన్ని రెండు రకాలుగా గుర్తించవచ్చు. ప్రవర్తన భేదాలు, భౌతిక మార్పులను గమనించి అంచనా వేయవచ్చు.
ప్రవర్తన భేదాలు..
రైతులు చెరువుల వద్ద చేపలను జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రవర్తన భేదాలను తేలికగా కనిపెట్టే వీలుంటుంది.
అనారోగ్యంతో ఉండే చేపలు ఈత సమయంలో సమన్వయం, స్థిరత్వం కోల్పోయి వెల్లకిలా తిరిగిపోతాయి.
అనారోగ్యంతో ఉన్న చేపలు బాధతో నోటిని తెరుస్తూ.. మూస్తూ, చెరువు గట్టుకు రాసుకుంటూ తిరుగుతాయి.
భౌతిక మార్పులు..
చేపలు అనారోగ్యంతో ఉన్నాయని అనుమానం వస్తే కొన్ని చేపలను పట్టుకుని పరిశీలించినట్లయితే కొన్ని భౌతికపరమైన మార్పులను గమనించవచ్చు.
చేప శరీరం రంగు, మెరుపుదనంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
శరీరంపై కురుపులు, ఎరుపు మచ్చలు, పుండ్లు ఏర్పడి రక్తం కారడం కనిపిస్తుంది.
చేపల్లో వచ్చే సాధారణ వ్యాధులు
చేపల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో ఫంగస్, హెల్మంథిస్, బ్యాక్టీరియల్ వ్యాధులు ప్రధానమైనవి. వీటి తో పాటు వాతావరణ సంబంధిత సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది.
ఫంగస్ వ్యాధులు : ఫంగస్ వ్యాధుల్లో శాఫ్రోలెగ్నియా ముఖ్యమైంది. చేప చర్మం, మొప్పలపై బూజు పట్టినట్లుగా ఉంటే ఫంగస్ వ్యాధిగా గుర్తించాలి. నీటిలో ఉదజని సూచిక తగ్గినప్పుడు ఫంగస్ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ.
నివారణ : 3 చెరువుల్లో ఉదజని తగ్గకుండా ఉండేలా పర్యవేక్షిస్తుండాలి.