‘ఇంటిపంట’తో సహజ ఆహారం!
ఆహారమే దివ్యౌషధం. ప్రకృతి సిద్ధంగా పం టలు పండించడం ద్వారా అమృత సమాన మైన ఆహారాన్ని తరతరాలుగా మనం తింటు న్నాం. అయితే, ఆధునిక వ్యవసాయ పరిజ్ఞా నం పేరుతో రంగంలోకి వచ్చిన అధిక దిగు బడి వంగడాలు, రసాయనిక ఎరువులు వాటి తో పాటే వచ్చిన పురుగు మందులు, కలుపు నాశనులు, జన్యుమార్పిడి విత్తనాలు... ఆహా రాన్ని విషతుల్యంగా మార్చేశాయి. భూమిని నాశనం చేశాయి. వినియోగదారుడికి రసా యనిక అవశేషాలతో కూడిన ఆహారాన్ని అం దిస్తున్నాయి. ఫలితంగా ఎటు చూసినా మధు మేహం, కేన్సర్, గుండెజబ్బులు... లేని జబ్బు లేదు. మార్కెట్‌లోకి వెళ్లి ఆకుకూరలు కొను గోలు చేసి కూరవండితే రసాయనాల వాసన!
పాలకుల ఉదారవాద విధానాల వలన వ్యవసాయం కుంటుపడి జీవికకు ఆధార పడదగిన వృత్తి కాకుండాపోయింది. ఫలితంగా అన్నివర్గాల ప్రజలూ గ్రామాలను వదిలి పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్నారు. నగరాలు, పట్టణాలు ఎంత విస్తరిస్తూ ఉంటే.. ప్రకృతి ఆ మాటకొస్తే పంట పొలం - ఆయా నగరాలు, పట్టణాల్లోని జనానికి అంత దూ రంగా జరుగుతోంది. దీని అర్థం ఏమిటం టే... పోయిన ఏడాదికంటే ఈ ఏడాది మరింత ఎక్కువ దూరం నుంచి తర లించిన ఆహా రంపై పట్టణ ప్రాంతవాసులు ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో నగరాలు, పట్ట ణాల్లో నివాసం ఉంటున్న పౌరులు ఎవరైనా చేయా ల్సిందేమిటి? ‘థింక్ గ్లోబల్లీ... యాక్ట్ లోకల్లీ’ అనే నినాదం పర్యావరణ పరిరక్షణకే కాదు, మంచి ఆహారోత్పత్తికీ వర్తిస్తుంది.
ఆహారోత్పత్తి గ్రామీణ రైతుల పని మా త్రమేనా? పట్టణాలు, నగరాల్లో ఇళ్లు కట్టు కొని నివాసం ఉంటున్నంత మాత్రాన విని యోగదారులు రసాయనాల అవశేషాలున్న ఆహారం తింటూ రోగగ్రస్తులు కావాల్సిందే నా? పట్టణాలు, నగరాలలో ఇళ్లపైన, ఇంటి ముందు, వెనుక ఉండే పెరటి స్థలాలను - అవి ఎంత చిన్నవైనా సరే - ఉపయోగించి ఉన్నంతలో, సాధ్యమైనన్ని ‘ఇంటిపంట’లు పండించలేమా? కనీసం ఆకుకూరలు, కూర గాయలు పండించుకోలేమా? నగరాలు, పట్టణాల్లో ఖాళీగా ఉంటున్న మేడల పైకప్పులను వృథాగా వదిలేయకుండా అక్కడ పరిమితంగా పండించలేమా? క్యూబాలో మాదిరిగా ఆహారాన్ని భారీ ఎత్తున ఆరోగ్యదాయకంగా పండించుకోవడం ప్రారంభిస్తే రసాయనాల వాడకానికి అలవాటైపోయిన రైతులకు కూడా ఈ దారి చూపొచ్చుకదా? మాకు రసాయనాలు వాడకుండా పండించిన ఆహారమే కావా లని ప్రభుత్వానికి చాటి చెప్పడానికి ‘ఇంటి పంట’ల సాగు ఒక ఆచరణాత్మక మార్గం కాదా? ఇటువంటి ఆలోచనల నుంచే ‘సాక్షి’ దిన పత్రికలో ‘ఇంటిపంట’ శీర్షిక సరిగ్గా రెండున్న రేళ్ల క్రితం పుట్టుకొచ్చింది. స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు భాగస్వా ములవడంతో ఇంతింతై వటుడింతై అన్న ట్లుగా ప్రజాయజ్ఞంగా మారింది. పర్యావరణా నికి అనుకూలమైన సాగు పద్ధతులను పట్టణ, నగర, గ్రామీణ ప్రాంత తెలుగు పాఠకులకు ప్రభావశీలంగా పరిచయం చేయడానికి ఇంటి పంట శీర్షిక ఎంతగానో దోహదపడింది.
సోషల్ మీడియాలో కూడా ‘ఇంటిపంట’ తనదైన చెరగని ముద్రవేసింది. గూగుల్ గ్రూప్స్‌లో ‘ఇంటిపంట’ ఆన్‌లైన్ గ్రూపును ఏర్పాటు చేయడం, ఫేస్‌బుక్‌లో ‘ఇంటిపంట’ గ్రూప్ ప్రారంభమయ్యాయి. దీంతో హైదరా బాద్‌లోనే కాకుండా దేశ విదేశాల్లో ఉంటున్న కిచెన్ గార్డెనింగ్ ప్రేమికులంతా చర్చించుకోవ డం, అనుభవాలను పరస్పరం పంచుకోవడం నిత్యకృత్యమైంది. ‘ఇంటిపంట’ వేదిక ద్వారా స్నేహితులైన వారు కలుసుకుంటూ భావాల ను కలబోసుకుంటూ, విత్తనాలను, మొక్క లను పంచుకుంటూ ఆనందిస్తూ ఉండటం ఆహ్వానించదగిన పరిణామం. ‘సాక్షి’ వంటి ఒక ప్రధానస్రవంతి మీడియాసంస్థ ‘ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్’ను ఒక యజ్ఞంలా చేపట్టి కొనసాగించడం బహుశా దేశంలో ఇదే ప్రథమం.
‘ఇంటిపంట’ ప్రభుత్వాన్ని సైతం కదిలించడం విశేషం. ఉద్యానశాఖ కేంద్ర ప్రభు త్వపథకం ఆర్‌కేవీవై గ్రాంటు ద్వారా ‘ఇంటి పంట’ సబ్సిడీ పథకాన్ని హైదరాబాద్ నగరంలో 2013 మార్చిలో ప్రారంభించింది. సబ్సిడీతో ‘ఇంటిపంట’ కిట్లు అందిస్తున్నారు. విపరీతమైన స్పందన రావడంతో తొలుత ఇచ్చిన 75 శాతం సబ్సిడీ ఇప్పుడు 50 శాతా నికి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. వేసవి తరువాత ఈ సబ్సిడీ పథకాన్ని ఇంత వరకు తిరిగి ప్రారంభించకపోవడం ప్రజలను నిరుత్సాహపరుస్తోంది. రాష్ట్ర ర్యాప్తంగా ఈ సబ్సిడీ పథకాన్ని అందించి ఆరోగ్యదాయ కంగా మేడలపైన, పెరట్లో సేంద్రియ కూరగా యలు, ఆకుకూరలు, పండ్లు పండించుకునేం దుకు దోహదపడతామని ఉద్యాన మంత్రి అప్పట్లో ప్రకటించారు. ఈ హామీని అమలు చేయడం అవసరం. హైదరాబాద్‌లో ప్రారం భమైన ‘ఇంటిపంట’ సబ్సిడీ పథకం స్ఫూర్తి తో తమిళనాడు ప్రభుత్వం చెన్నై, కోయంబ త్తూరు నగరాలలో సబ్సిడీ పథకాన్ని ప్రారం భించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.
ఇళ్లదగ్గరే కాదు బహిరంగ స్థలాలలోనూ ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. నగరాలు, పట్టణాలకు వలస వచ్చే నిరుపేదల కోసం పది చదరపు గజాల చొప్పున ప్రభుత్వ స్థలం కేటాయిస్తే సామూహిక ఇంటిపంటల సాగుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించాలి. పోషకాహార లభ్యతను పెంచ డంలో సామూహిక ఇంటిపంటల సాగు ఎం తో ఉపయుక్తంగా ఉంటుందని ఇతర దేశాల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్యూబా వంటి దేశాల్లో అక్కడి పట్టణాలు, నగరాల్లో ఇంటిపంటల ద్వారా పండిన కూర గాయలు, ఆకుకూరలు, పండ్లు గ్రామాలకు సరఫరా అవుతున్నాయి. పట్టణ ప్రాంత జనా భా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఈ తరు ణంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటిపంటలకు ఆవశ్యకత పెరుగుతున్నది. నిరుద్యోగులు, వలస వచ్చిన గ్రామీణుల ఉపాధి కల్పనకు ప్రభుత్వం సామూహిక ఇంటిపంటల సాగు క్షేత్రాలను ఏర్పాటు చేస్తే మంచి ఆహారాన్ని పట్టణ, నగర ప్రజలకు అందుబాటులోకి తేవ డానికి ఆస్కారం ఏర్పడుతుంది. విద్యార్థుల ను సైతం ఈ మహాయజ్ఞంలో భాగస్వాముల ను చేయగలిగితే భవిష్యత్‌తరానికి మట్టి వాస న చూపే సదవకాశం కలుగుతుంది. వాతావ రణ మార్పుల నేపథ్యంలో రానున్న సంక్షో భాలను ఎదుర్కోవడానికి ఇది తెలివైన మా ర్గంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
రసాయనిక వ్యవసాయంతో ప్రాప్తించిన ఎడతెగని వ్యవసాయ సంక్షోభం రాచపుం డులా సమాజాన్ని నిలువునా తొలిచేస్తోంది. అప్పుల నుంచి, భూసార నష్టం నుంచి బయ టపడే మార్గాలను రైతులు వెదుక్కుంటు న్నారు. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారంతో వ్యాధుల రూపంలో విరుచుకు పడుతున్న ఉపద్రవాన్ని వినియోగదారులూ గ్రహిస్తున్నారు. ఈ పూర్వరంగంలో తెలుగు నాట ప్రారంభమైన ఈ ‘ఇంటిపంట’ల సేం ద్రియ/ప్రకృతి ఆహారోద్యమం సుదీర్ఘ ప్రయా ణానికి చిన్న ప్రారంభం మాత్రమే.
-పంతంగి రాంబాబు
‘సాక్షి’ స్పెషల్ డెస్క్