మినుము
ప్రస్తుతం రబీలో మినుము సాగు చేసేందుకు అనువైనం సమయం. ఆయూ సమయూల్లో కింది రకాలు వేసుకుంటే మేలు.
నవంబరు రెండో పక్షం నుంచి డిసెంబరు మొదటి పక్షం వరకు విత్తుకొనే మినుము రకాలు ఎల్‌బీజీ-645, ఎల్‌బీజీ-648
డిసెంబరు రెండో పక్షం నుంచి డిసెంబరు చివరి వరకు విత్తుకొనే మినుము రాకాలు ఎల్‌బీజీ-645, ఎల్‌బీజీ-685
జన వరిలో విత్తుకొనే రకాలు-ఎల్‌బీజీ-752, ఎల్‌బీజీ-623
పల్లాకు తెగులు తట్టుకునే పీయూ-31 రకాన్ని అన్ని కాలాల్లో విత్తుకోవచ్చు.
పెసర
నవంబరు రెండో పక్షం నుంచి జనవరి వరకు విత్తుకొనే రకాలు ఎల్‌జీజీ-42, టీఎం96-2, ఎల్‌జీజీ-410.
విత్తనమోతాదు
ఒక చదరపు మీటరుకు సుమారు 30-35 మొక్కలు ఉండేలా మినుము అరుుతే ఎకరాకు 16-18 కిలోలు, పెసర అరుుతే 10-12కిలోల విత్తనాలు వెదజల్లితే మంచి దిగుబడులు సాధించవచ్చు.
విత్తనశుద్ధి
కిలో విత్తనానికి 30 గ్రా.కార్బోసల్ఫాస్ మందును వాడి విత్తనశుద్ధి చేయూలి. కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5గ్రా. థయోమిథాక్సామ్ కలిపి విత్తనశుద్ధి చేస్తే సుమారు 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు.
కలుపు నివారణ:
గడ్డి, వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉంటే ఇమిజితాఫిర్ పది శాతం మందును 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేస్తే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కొన్ని భూముల్లో బంగారుతీగ సమస్య ఎక్కువగా ఉంది. దీని నివారణకు ఆశించిన ప్రదేశాల్లో మాత్రమే పారాక్వాట్ 24 శాతం ద్రావకం 50 మిల్లీలీటర్లు, పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయూలి.
పత్తి తీతలో మెలకువలు
పత్తి తీయడం మొదలైనందున మంచి నాణ్యత కోసం కింది మెలకువలు పాటించాలి.
బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుంచి వేరుచేయూలి.
మంచువల్ల పత్తి నాణ్యత దెబ్బతింటుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు పత్తి తీయూలి.
వేడి ఎక్కువగా ఉన్న సమయంలో పత్తి తీస్తే వాటితోపాటు గుల్ల వద్ద ఉన్న తొడిమలు, ఎండిన ఆకులు పెళుసెక్కి ముక్కలై పత్తికి అంటుకొంటారుు.
పత్తి తీయగానే నీడలో మండెలు వేసి తగు తేమ శాతం వచ్చేవరకు ఆరబెట్టాలి. మొదటిసారి తీసిన పత్తిని తరువాత తీసిన పత్తితో కలపకుండా విడిగా అమ్ముకోవాలి. అప్పుడు తరువాత తీసిన పత్తికి ఎక్కువ ధర పలుకుతుంది.
వేరుశనగ
రబీ సీజనుకు అనువైన వేరుశనగ రకాలు
చిన్నగుత్తి రకాలు: కదిరి-6, కదిరి-9 కదిరి హరితాంధ్ర, అనంత మరియు ధరణి
పెద్ద గుత్తి రకాలు: కదిరి-7 బోల్డ్ మరియు కదిరి-8 బోల్డ్
రబీలో వేరుశనగ డిసెంబరు 15 వరకు వేసుకోవచ్చు.
విత్తన శుద్ధి: కిలో వేరుశనగ విత్తనానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల డైథేన్ ఎం45 కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
వేరు పురుగు సమస్య ఉన్న నేలలకు ఫ్యురడాస్ 4 జీ గుళికలు 5 కేజీలు ఎకరాకు దుక్కిలో వేసుకోవాలి.
వేరుశనగ విత్తనం మొలకెత్తాక తొలి పూత కనిపించేవరకు (25 నుంచి 30 రోజులు) తడి ఇవ్వకూడదు. తరువాత నుంచి బెట్ట రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
రబీ పంట కాలం వేరుశనగ విత్తనోత్పత్తికి చాలా అనువైన కాలం.
విత్తిన మూడు రోజుల్లోపు పై సాళ్లు వేసిన తరువాత ఒక లీటరు పెండి మెథాలిన్ కలుపు మందును ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన 40 నుంచి 50 రోజుల వరకు కలుపు నివారించుకోవచ్చు.