
జీవామృతంతో చేపల పెరుగుదల బాగుంది!
25, 15 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువుల్లో తెల్ల(మంచినీటి) చేపలను సాగు చేస్తున్నాం. గత 8 నెలలుగా ప్రతి 10,15 రోజులకోసారి జీవామృతం చల్లుతున్నాం. 25 ఎకరాల చెరువులో ప్రతిసారీ 600 లీటర్లు జీవామృతాన్ని పడవలో తీసుకెళ్లి చల్లుతున్నాం. దీనివల్ల ప్లాంక్టన్ బాగా పెరుగుతున్నది. మొప్పల వ్యాధి, తోక కొట్టడం వంటి జబ్బులు రావడం లేదు. మేత మామూలుగానే కడుతున్నాం. నెలకు 125 - 150 గ్రాముల చొప్పున చేపలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పట్టుబడి చేస్తాం.
- మంతెన కరుణరాజు (94407 03033), యాజలి, కర్లపాలెం మండలం, గుంటూరు జిల్లా