అస్తవ్యస్తత, అయోమయం
పెద్ద నోట్ల రద్దు తదుపరి ఏర్పడ్డ నగదు కొరత సంక్షోభం నాలుగో వారంలోకి అడు గిడుతుండగా.. సోమవారం ఒడిశాలో ఒక నవ వధువు ‘రద్దు’ కాటుకు రాలిపోయి మృతుల సంఖ్యను 80 పైకి చేర్చింది. ఈ నెల 8 నుంచి సాగుతున్న సంచలన ప్రక టనల పరంపరలో మరో రెండు అదే రోజు వెలువడ్డాయి. ఒకటి బీజేపీ పార్ల మెంటు సభ్యులంతా పెద్ద నోట్ల రద్దు తదుపరి తాము జరిపిన బ్యాంకు లావాదేవీల వివరాలను బహిర్గత పరచాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన. బీజేపీ పెద్దలకు ముందే నోట్ల రద్దు నిర్ణయం తెలుసనే విమర్శలోని నిజమెంతైనా.. ఈ ప్రకటన ఆ అనుమానాన్ని నివృత్తి చేసేది కాదు. ముందే సర్దుకున్నాక చూపుతున్న లెక్కలివి అనే మాట రాకుండా ఉండదు.
2013-14 నుంచి 2014-15 మధ్య బీజేపీకి అందిన నిధులు రూ. 977 కోట్లు. ప్రధాని ఆ నిధుల దాతల పేర్లను బయ టపెట్టి ఉంటే అది ఆదర్శం అయ్యేది. దేశంలోని తీవ్ర నగదు కొరతను, దానివల్ల ఏర్పడ్డ అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దడానికి బదులు ప్రభుత్వం విమర్శలను తిప్పికొట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నదని అనిపిస్తే తప్పు కాదు. నోట్ల రద్దు సదు ద్దేశాలతో చేపట్టిన చర్యే అయినా, అందుకు ఎలాంటి ముందస్తు కసరత్తు, సన్నాహాలు చేయలేదనడానికి బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్న వారు, నాగపూర్ వంటి పలుచోట్ల రోడ్లపైనే పండ్లు తదితర ఉత్పత్తులను కుమ్మరించి పోతున్న రైతులే సాక్ష్యం.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అదే రోజున లెక్కలు వెల్లడించకుండా రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే అందులో సగాన్ని తెల్లదిగా మార్చుకునే రాచమార్గాన్ని తెరిచారు. నల్ల ధన కుబేరులు తమ నల్ల సంప దలో 3 నుంచి 8 శాతమే నగదుగా దాచుకుంటారని అంచనా. 30 శాతం కమిషన్‌కు అక్రమంగా పాత నోట్లను మారుస్తున్నవారు దొడ్డిదారిన చేస్తున్న పనిని 50 శాతం కమిషన్‌కు ప్రభుత్వమే చట్ట బద్ధంగా చేయడానికి సిద్ధపడటం భావ్యమా? కోట్లాది మంది ప్రజలు తమ కష్టార్జి తాన్ని బ్యాంకుల నుంచి తీసుకోడానికి 22 రోజులుగా ఇన్ని యమయాతనలు పడుతున్నది ఇందుకోసమేనా?
ఏ తప్పూ చేయకుండా 22 రోజులుగా శిక్ష అనుభవిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగేలా ఆర్థికవ్యవస్థలోకి త్వరితగతిన తిరిగి ద్రవ్యత్వాన్ని తీసు కురావడంపై దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయమిది. అందుకు బదులుగా పెద్ద నోట్ల రద్దును నల్లధనం నిర్మూలనకు అత్యంత సమర్థవంతమైన సాధనంగా, అని వార్యమైన ప్రారంభ స్థానంగా నిరూపించాలని ఆరాటపడటం, అందుకోసం రోజూ సంచలనాత్మక ప్రకటనలు గుప్పించడం అనర్థదాయకమని ప్రభుత్వం గుర్తిస్తు న్నట్టు కనబడదు.
సోమవారం ఇంఫాల్‌లోని ఒక ఎస్‌బీఐ శాఖపై ప్రజలు విరుచు కుపడి విధ్వంసానికి పాల్పడ్డారు. కారణం ప్రభుత్వం, ఆర్‌బీఐ చేస్తున్న ప్రకటన లకు విరుద్ధంగా రూ. 24 వేలకు బదులుగా రెండు లేదా నాలుగు వేలు, అదీ నగదు ఉన్నంత వరకే ఇస్తామనడమే. పై నుంచి చేసే ప్రకటనలకు వాస్తవ పరిస్థితికి పొంతన కుదరకపోతే ఇలా ప్రజల ఆగ్రహం కట్టలు తెగక తప్పదు. ఇలాంటి ప్రమాదం ఉన్నదనే అత్యున్నత న్యాయస్థానం భయపడింది. పరిస్థితి ఇలా ఉండగా.. నగదు లభ్యత పెరగనున్న దృష్ట్యా నగదు ఉపసంహరణ పరిమితిని రూ. 40 వేలకు పెంచుతున్నామంటూ ఆర్‌బీఐ క్రూర పరిహాసోక్తిని విసిరింది.
తొలగించిన 86 శాతం నోట్ల స్థానే కొత్త నోట్లను ప్రవేశపెట్టడం ఎప్పటికి పూర్తవుతుందో, సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో తెలియని అయో మయావస్థ సర్వత్రా నెలకొంది. దీన్నే నల్ల ధనాన్ని తుదముట్టించే యుద్ధంలోని తొలిమెట్టని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని చర్యలు అంటూ హడావుడి ప్రకటనలను వెలువరిస్తున్నారు. అసంఘటిత రంగంలో పని చేస్తూ జాతీయ ఉత్పత్తిలో దాదాపు సగాన్ని సృష్టిస్తున్న 90 శాతం శ్రామిక జనా భాకు వీటివల్ల కలిగే ఊరట ఏమిటి? దేశంలోని పలు ప్రముఖ వ్యవసాయ మార్కెట్లకు వచ్చే పత్తి వంటి ఉత్పత్తుల రవాణా 50 శాతం నుంచి 75 శాతం వరకు పడిపోయింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పైగా నగదు కొరతను ఆసరా చేసుకుని నల్ల కుబేరులు పలుచోట్ల రైతులకు రద్ద యిన నోట్లను అంటగడుతున్నారు. వాటిని రైతులు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే అక్కడి అధికారులు అక్రమంగా బకాయిల కింద జమచేసేసుకుని, మొండి చెయ్యి చూపుతున్నారు.
మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొందరు రైతులు రూ. 100 నోట్లను ఇచ్చేట్టయితే 85 శాతం చెల్లించినా సరే అని పంటను అమ్మేసుకుంటున్నారు. ఆచ రణసాధ్యమైన తక్షణ తరుణోపాయాలను అన్వేషించాల్సిన సంక్షోభంలో దేశం చిక్కుకుని ఉండగా.. నగదు రహిత కార్యకలాపాలే అన్ని సమస్యలకు పరిష్కా రమనే ప్రచారం ఊపందుకుంది. నగదు రహిత లావాదేవీలు జరిపేవారు జనాభాలో 2 శాతమే. యునెస్కో 2015 నివేదిక ప్రకారం మన దేశంలో కనీస అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యులు 28.7 కోట్లు. కార్డులు, మొబైళ్లు, ఈ-వ్యాలెట్లతో నగదు రహిత లావాదేవీలు జరపడానికి అవసరమైన ఈ-అక్షరాస్యులు కాని వారి సంఖ్య ఇంతకు రెట్టింపైనా ఉంటుంది. ఇప్పుడు ఉన్న డెబిట్ కార్డులతో జరుపు తున్న లావాదేవీలలో 94.8 శాతం ఏటీఎంల నుంచి నగదును తీసుకోడానికి జరుపుతున్నవే. పైగా 23.3 కోట్ల మంది ప్రజలు బ్యాంకింగ్ రంగానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇవన్నీ మరచి సింగపూర్‌ను ఆదర్శంగా చూపుతున్నారు. కానీ అది అర కోటి జనాభా గల చిన్న నగర రాజ్యం.
దానికే ఈ పరివర్తనకు 30 ఏళ్లు పట్టింది. ఈ వాస్తవాన్ని దాటవేసినంత తేలికగా భారీ ఎత్తున నగదు రహిత కార్యకలాపాలను ఆచరణలోకి తేలేరు. సుదీర్ఘ కాలంలో ఒక ప్రణాళిక ప్రకారం మెట్టుమెట్టుగా ప్రజలకు అలవాటు చేయాల్సిన పనిని హఠాత్తుగా సాధ్యం చేయా లనుకోవడం పగటి కలే. నిరవ ధికంగా ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల నుంచి తీసుకోకుండా ఆంక్షలను విధించడం అసంబద్ధం, అక్రమం, అన్యాయం. బేషజా లకు, కుహనా ప్రతిష్టలకు పోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా నగదు కొరతను తీర్చ డానికి అవసరమైన చర్యల కోసం నిపుణుల సలహాలను తీసుకుని పరిస్థితిని చక్క దిద్దడానికి పూనుకోవడం ఆవశ్యకం.