
చిరస్మరణీయ జ్ఞాపకాలు
చెల్లెమ్మా... అక్కయ్యా, తమ్ముడూ, అన్నయ్యా.... అంటూ అందర్నీ పలకరిస్తూ, జనంతో మమేకమై అన్ని వర్గాల, కులాల, మతాల ప్రజల అవసరాల్ని గుర్తిస్తూ, పలు పథకాలతో వాటిని తీరుస్తూ రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహానేత వైఎస్.
సందర్భం
చెల్లెమ్మా... అక్కయ్యా, తమ్ముడూ, అన్నయ్యా.... అంటూ అందర్నీ పలకరిస్తూ, జనంతో మమేకమై అన్ని వర్గాల, కులాల, మతాల ప్రజల అవసరాల్ని గుర్తిస్తూ, పలు పథకాలతో వాటిని తీరుస్తూ రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహానేత వైఎస్. టీడీపీ మరలా అధికారానికి వస్తే తమకు బతుకే లేదన్న స్థితిలో రోదిస్తుండిన వివిధ వర్గాల పేద ప్రజలను 2003 నాటి ప్రజా ప్రస్థాన పాద యాత్ర ద్వారా గుండెలకు హత్తుకొని ధైర్యాన్ని కల్పిం చారు వైఎస్, 2004 ఎన్నికల విజయం అనంతరం తన సంక్షేమ పాలనతో ‘ఇక మేము దిగులు లేకుండా బతక గలం’ అని పేద ప్రజలు ధీమాగా చెప్పుకొనే స్థాయికి వారిని తీసుకెళ్లిన జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.
ఉమ్మడి ఏపీలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభి వృద్ధిని తన పాలనా దక్షతతో సమపాళ్లలో సాధించిన దార్శనికుడాయన. ఆయన ఉపన్యాసాలు వినడానికి జనం తండోపతండాలుగా కదలివచ్చేవారు. ఎన్నికల సభల్లో ‘చేయి’ ఊపి ప్రచారం చేస్తే, ఇక ఆ నియోజకవర్గ అభ్యర్థి నిశ్చింతగా నిద్రపోయేవాడు. కానీ, ఆయన మరణించాక ‘సీనియర్ల’ రూపంలో ఆ పార్టీ నేతలు ఉమ్మడి రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని దుస్థితిలోకి నెట్టేశారు. రెండు దశాబ్దాల గడ్డుకాలాన్ని అధిగమించి, పార్టీకి పునరుజ్జీవం కల్పించి, నేతృత్వం వహించి, పార్టీ ప్రతిష్టను తారస్థాయికి వైఎస్ తీసుకెళ్లిన పార్టీ ఇదేనా అన్న సందేహం కలుగుతుంది. 1983 నుంచి 2004 ఎన్నికల వరకూ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్.. పార్టీని పదిల పరచుకోలేకపోయింది. మధ్యలో కొద్దికాలం తప్ప దాదాపు ఇరవై సంవత్సరాలపాటు ఆ పార్టీ చావుబ్రతు కుల మధ్య కొట్టుమిట్టాడుతూ కాలం వెళ్లబుచ్చింది.
వైఎస్ మరణానంతరం సీనియర్ల ముసుగులో మమ్మల్ని మించిన నాయకులు లేరంటూ హంగామా చేసిన ఏ ఒక్కరూ, ఆ 20 ఏళ్లలో పార్టీని బ్రతికించుకోవ డానికి, కృషి చేయలేదన్నది సత్యం. అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా సాగిం చిన పాద యాత్రతో కాంగ్రెస్‌ను బతికించి, బలోపేతం చేసిన నేత డాక్టర్ వైఎస్. తన విలక్షణమైన కార్య క్రమాలతో ప్రజలను తనవైపు, తన పార్టీవైపు ఆకర్షించి 2004 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి చిన్న, పెద్ద ఎన్ని కల్లో కాంగ్రెస్‌కు వరుస విజయాలను సాధించిపెట్టడమే గాక, కేంద్రంలో సైతం తన పార్టీ అధికార పగ్గాలు చేపట్టేటట్లు అంకిత భావంతో శ్రమించిన రాజకీయ కృషీ వలుడు ఆయన.
ఇక, ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేప ట్టిన అనంతరం తెలుగు నేల కీర్తిప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన ఘనుడాయన. అలాంటి నాయకుని తరువాత పేద ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి, గౌరవించి, వైఎస్ ఆశయాలను, పథకాలను సమర్థంగా ఎవరైతే కొనసా గించగలరని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారో గుర్తెరిగి అలాంటి నాయకునికే వయస్సు, సీనియారిటీలతో నిమిత్తం లేకుండా సీఎం పదవిని అప్పగించి ఉంటే 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలోనేకాక, కేంద్రంలో కూడా అధికారాన్ని చేపట్టి ఉండేది.
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొన్న వైఎస్ జ్ఞాపకాలను కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా అది ఎంత ప్రమాదకరమో కాంగ్రెస్‌కు తెలిసి వచ్చింది. వైఎస్ కుటుంబంపట్ల, యువనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పట్ల నాటి కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న నిర్ణయం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, భవి ష్యత్తును ఎంత తీవ్రంగా ప్రభావితం చేసిందో ఇప్పటి కైనా ఆ పార్టీ నేతలు ముసుగులు తొలగించుకొని ఆలో చిస్తే మంచిది. ఒక నాయకుడి మరణంపట్ల దిగ్భ్రాంతి చెంది, తీవ్ర వ్యథకు గురై 600 మందికి పైగా ప్రాణాలు వదలడం చరిత్రలో ఇప్పటి వరకూ లేదు. ఇది చాలు జనం గుండెల్లో చెరగని ముద్ర వైఎస్ అని చెప్పడానికి. ఆయన 2004-2009 మధ్య రైతులకు కల్పించిన రక్ష ణలు, రైతు కూలీలకు కల్పించిన భద్రత, పేదలకు కల్పించిన ధీమా, మహిళలకై చేపట్టిన ప్రగతి విధా నాలు, యువతకు కల్పించిన భరోసా, గిరిజనులకు అందించిన అండ, మైనారిటీలకు కల్పించిన అభయం వంటివి జనం గుండెల్లో ఆయన శాశ్వతంగా నిలిచి పోయేట్లు చేశాయి. ఆయన ఆశయాల్ని అమలు చేయ గలడనే నమ్మకాన్ని కల్గించగల నాయకుడు విజయాన్ని తప్పక సాధిస్తాడు, జనం మరలా సంతోషాంధ్రను చూస్తారు.
(నేడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి)
వ్యాసకర్త: దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, విశ్రాంత ఆచార్యులు, చరిత్ర శాఖ,
ఎస్వీ యూనివర్సిటీ మొబైల్ : 98495 84324